Kajal Aggarwal : అంద‌మైన చంద‌మామ‌కు గౌర‌వం.. యూఏఈ గోల్డెన్ వీసా పొందిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌..

February 4, 2022 8:46 AM

 Kajal Aggarwal : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది సెల‌బ్రిటీలు యూఏఈ గోల్డెన్ వీసా పొందుతున్నారు. ఆ వీసా ఉండ‌డం అంటే అదొక ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే అనేక మంది స్టార్స్ ఆ వీసా పొందారు. ఇక తాజాగా చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ వీసాను పొందింది. ఈ మేర‌కు ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.

 Kajal Aggarwal gets UAE golden visa
Kajal Aggarwal

యూఏఈ గోల్డెన్ వీసా పొందినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని, త‌మ‌లాంటి స్టార్స్‌ను యూఏఈ ప్రోత్స‌హిస్తుంద‌ని, అందుకు గాను ఆ దేశ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాన‌ని.. పేర్కొంది. ఇక ఈమెక‌న్నా ముందు న‌టి త్రిష కూడా ఈ వీసాను పొందింది.

ఫ‌రా ఖాన్‌, షారూఖ్ ఖాన్‌, బోనీ క‌పూర్‌, అర్జున్ క‌పూర్‌, జాన్వీ క‌పూర్‌, నేహా క‌క్క‌ర్‌, అమాల్ మాలిక్‌, మోహ‌న్ లాల్‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, మ‌మ్ముట్టి.. రీసెంట్‌గా సానియా మీర్జాల‌కు యూఏఈ గోల్డెన్ వీసా ల‌భించింది. ప‌లు ప్ర‌త్యేక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రోత్సాహ‌కంగా ఈ వీసాను యూఏఈ ప్ర‌భుత్వం అందిస్తోంది.

ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి కాగా.. ఈమె న‌టించిన ఆచార్య మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే సినామికా అనే త‌మిళ సినిమా, ఉమ అనే హిందీ మూవీలోనూ ఈమె న‌టించ‌గా.. అవి కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment