Kajal Aggarwal : పండంటి మ‌గ‌బిడ్డకు జ‌న్మనిచ్చిన కాజ‌ల్ అగ‌ర్వాల్..!

April 19, 2022 6:27 PM

Kajal Aggarwal : క‌లువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రెగ్నెంట్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. కొద్ది రోజులుగా బేబీ బంప్‌తో తెగ సందడి చేసిన కాజల్ ఈ రోజు ఉద‌యం 7 గంట‌ల‌కు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో పండంటి మ‌గ‌బిడ్డకు జ‌న్మనిచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్ ప్ర‌ముఖ సెల‌బ్రిటీ ఫొటోగ్రాఫ‌ర్ వైర‌ల్ భ‌యానీ త‌న సోష‌ల్ మీడియా ద్వారా కాజ‌ల్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ క్ర‌మంలో ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖులు కూడా కాజ‌ల్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మ‌రి ఈ విషయంపై కాజ‌ల్ దంప‌తులు అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు చేస్తార‌నేది చూడాలి.

Kajal Aggarwal blessed with baby boy
Kajal Aggarwal

దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ముంబైలోని వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడింది. కొద్ది రోజుల డేటింగ్ అనంతరం వారిద్దరూ 2020 అక్టోబర్ 30వ‌ తేదీన సంప్రదాయ పద్దతుల్లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ విహారయాత్రల్లో దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ అగర్వాల్ ప్రెగ్రెంట్ అయింద‌నే వార్తను గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

నా భార్య ఎప్పుడూ అందంగా కనిపిస్తుంది అని కామెంట్ చేస్తూ.. గర్బం దాల్చిన మహిళ బొమ్మను పెట్టి.. కాజల్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఫ్యాన్స్ కి తెలియజేశాడు. కాజల్ అగర్వాల్ డెలివరీకి ముందు మాతృత్వం గురించి భావోద్వేగంగా స్పందించింది. మాతృత్వం అనేది అద్బుతమైనది. ఒక మూమెంట్‌లో అంతా మన చేతిలో ఉందని అనుకొంటాం. కానీ మరో క్షణం గడిస్తే.. మన చేతిలో ఏమీ లేదనే విషయం స్పష్టమవుతుంది. నిద్రించే సమయంలో నేను ఎలా మేనేజ్ చేస్తానా అనే ఫీలింగ్ కలిగేది. ఇలాంటి సమయంలోనే మన తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు. అప్పుడు రకరకాల బాధలను, సంతోషాలను మరిచిపోతాం.. అని ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment