Kaikala Satyanarayana : కైకాల హెల్త్ బులిటెన్.. కండిష‌న్ చాలా క్రిటిక‌ల్..

November 20, 2021 9:11 PM

Kaikala Satyanarayana : సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా ఉంది. కొన్ని రోజుల ముందు ఆయ‌న ఇంట్లో జారిప‌డి హాస్పిట‌ల్‌లో చేరారు. ఆరోగ్యం కాస్త కుదుట‌ప‌డింద‌ని అనుకున్న స‌మయంలో ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేర‌డం.. వైద్యులు ఆరోగ్య ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉంద‌ని చెప్ప‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. కైకాల సత్యనారాయణ హెల్త్ కండిషన్ పై డాక్టర్స్ మీడియా బులెటిన్ విడుదల చేయగా, ఆందోళన కలిగిస్తోంది.

Kaikala Satyanarayana  health bulletin condition is serious

కైకాల ఆరోగ్య‌ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ ప్రెస్ నోట్ లో వెల్లడించారు. ఐసీయూలో రెస్పిరేటరీ సిస్టమ్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరంలోని ప్రధాన అవయవాలు విఫలం చెందినట్లు వెల్లడించిన వైద్యులు, కాపాడడం కూడా చాలా కష్టం అన్నట్లు ధృవీకరించారు. శనివారం ఉదయం కైకాల సత్యనారాయణ జ్వరం, నీరసంతో ఆసుపత్రిలో చేరారు.

కైకాల‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కండిషన్ క్రిటికల్ గా ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల బృందం ఆయనను కాపాడడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంపై మాత్రం నమ్మకం లేదని తెలియజేస్తున్నారు. హెల్త్ బులిటెన్ త‌ర్వాత ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

కైకాల‌ స‌త్య‌నారాయ‌ణ‌ హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, ప్ర‌తి నాయ‌కుడిగా, క‌మెడియ‌న్ గా.. ఇలా అన్నీ ర‌కాల ప్రాత‌ల‌ను పోషించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాతగానూ సినిమాలను రూపొందించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment