KA Paul : ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కేఏ పాల్ బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. రూ.1000 కోట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌..

June 7, 2022 7:41 PM

KA Paul : జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. అక్క‌డ ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ వివిధ ర‌కాలుగా న‌ష్ట‌పోయిన వారికి ఆర్థిక స‌హాయం చేస్తూ వ‌స్తున్నారు. అయితే సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే ప‌వ‌న్ ప్ర‌స్తుతం రాజకీయాల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందులో భాగంగానే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో సైతం పోటీ చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలోగానీ.. తెలంగాణ‌లో కానీ.. పోటీ ఎలా చేయాలా.. అన్న అంశంపైనే ప‌వ‌న్ ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎదుట మూడు ఆప్ష‌న్లు కూడా క‌నిపిస్తున్నాయి.

ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితోనూ పొత్తుకు పోకుండా కేవ‌లం త‌న జ‌న‌సేన పార్టీతోనే ఒంట‌రిగా బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి. లేదా టీడీపీ, బీజేపీల‌తో వేర్వేరుగా.. లేదా క‌లిసి అయినా పొత్తు పెట్టుకోవ‌చ్చు. ఇలా ప‌వ‌న్ ఎదుట మూడు ఆప్షన్లు ఉన్నాయి. వాటినే ఆయ‌న ప‌రిశీలిస్తున్నారు. అయితే ఈ విషయం ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు తేలిపోనుంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన ప‌వ‌న్ ఈసారి ఎలాగైనా గెలిచి చూపించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. క‌నుక‌నే ఆయ‌న ఆ దిశ‌గా విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ప‌వ‌న్‌కు ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. ప‌వ‌న్‌కు ఆయ‌న రూ.1000 కోట్లు ఇస్తాన‌న్నారు. కానీ అందుకు ఒక ష‌ర‌తు విధించారు.

KA Paul offered Rs 1000 crores to Pawan Kalyan
KA Paul

ప‌వ‌న్ త‌న పార్టీలో చేరి పోటీ చేయాల‌ని కేఏ పాల్ కోరారు. అయితే ప‌వ‌న్‌ను త‌న పార్టీ త‌ర‌ఫున గెలిపించుకుంటామ‌ని.. ఒక వేళ ఓడిపోయిన ప‌క్షంలో ప‌వ‌న్‌కు తాను రూ.1000 కోట్ల‌ను న‌ష్ట ప‌రిహారం కింద చెల్లిస్తాన‌ని పాల్ అన్నారు. ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీకి తెలంగాణ‌లో లేదా ఏపీలో ఇత‌ర పార్టీల‌ను ఓడించే స‌త్తా లేద‌ని.. క‌నుక త‌మ పార్టీలో చేరాల‌ని పాల్ కోరారు. అయితే పాల్ ఆఫ‌ర్‌పై నెటిజ‌న్లు జోకులు పేలుస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌పై ఈ విష‌య‌మై ట్రోల్స్ వ‌స్తున్నాయి. మ‌రి పాల్ ఆఫ‌ర్‌ను ప‌వ‌న్ స్వీక‌రిస్తారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment