Jayasudha : టాలీవుడ్ పై జ‌య‌సుధ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు.. ముంబై వాళ్ల‌ను నెత్తిన పెట్టుకుంటార‌ని కామెంట్స్‌..

July 30, 2022 9:24 AM

Jayasudha : తెలుగు సినీ ప్రేక్ష‌కులు న‌టి జ‌య‌సుధ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఎన్నో చిత్రాల్లో న‌టించి స‌హ‌జ‌న‌టిగా పేరుగాంచారు. ఈమె ఇండ‌స్ట్రీలో 50 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకున్నారు. ఇలా సుదీర్ఘ కెరీర్ ఉన్న న‌టి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎవ‌రూ లేర‌నే చెప్పాలి. అయితే త‌న 50 ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో అనేక విష‌యాల‌ను ఆమె పంచుకున్నారు. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వ‌హించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జ‌య‌సుధ త‌న కెరీర్ కు చెందిన అనేక విష‌యాల‌ను వెల్ల‌డించారు.

50 ఏళ్లుగా హాలీవుడ్‌లో క‌నుక న‌టించి ఉంటే బొకెలు ఇచ్చి స‌న్మానాలు చేసేవార‌ని.. కానీ తెలుగులో ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని జ‌య‌సుధ అన్నారు. ఇన్ని సినిమాలు తీసినా కనీసం పద్మశ్రీ దక్కలేదని జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జ‌య‌సుధ త‌న కెరీర్‌ను బాల‌న‌టిగా ప్రారంభించింది. ఇప్ప‌టికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయితే త‌మ‌కు అనుకూలంగా మాట్లాడుతుంద‌ని చెప్పి కంగ‌నా రనౌత్‌కు ప‌ద్మ‌శ్రీ ఇచ్చార‌ని.. కానీ 50 ఏళ్లుగా సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న త‌న‌కు క‌నీసం ప‌ద్మ‌శ్రీ ద‌క్క‌లేద‌ని అన్నారు.

Jayasudha sensational comments on Tollywood
Jayasudha

సినిమా ఇండస్ట్రీలో ఎవ‌రినైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను ఇండ‌స్ట్రీలో ఉండ‌నిచ్చేవారు కాద‌ని జ‌య‌సుధ అన్నారు. ముంబై నుంచి వ‌స్తే నెత్తిన పెట్టుకుంటార‌ని, వారి కుక్క పిల్ల‌ల‌కు కూడా రూమ్స్ ఇస్తార‌ని, కానీ ఇక్క‌డి న‌టీన‌టుల‌కు అంత‌గా ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌ర‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ గొడ‌వ‌లు భ‌రించ‌లేక అమెరికా వెళ్లాన‌ని.. ఎన్నిక‌లు అయ్యాకే వ‌చ్చాన‌ని తెలిపారు. అప్ప‌ట్లో శోభ‌న్‌బాబు డ‌బ్బులు పొదుపు చేసుకోమ‌ని, స్థలాలు కొనాల‌ని అనేక సార్లు చెప్పార‌ని, కానీ తాను వినిపించుకోలేద‌ని.. సావిత్రిలా తాను కూడా ఎంతో డ‌బ్బును పోగొట్టుకున్నాన‌ని జ‌య‌సుధ తెలిపారు.

కాగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీపై జ‌య‌సుధ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పటికే సినిమాల‌కు క‌లెక్ష‌న్లు లేక ఇండ‌స్ట్రీ పెద్ద‌లు స‌మ‌స్య‌ల వ‌ల‌యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ స‌మ‌యంలో జ‌య‌సుధ చేసిన వ్యాఖ్య‌లు పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు అవుతోంది. మ‌రి ఆమె కామెంట్స్‌పై ఎవ‌రైనా స్పందిస్తారో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment