Jayasudha : సహజనటి జయసుధ తన విలక్షణమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పటికీ ఈమె అంటే ఎంతో మందికి చెప్పలేనంత అభిమానం ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా సంచలనాలు రేపారు జయసుధ. కేవలం హోమ్లీ హీరోయిన్‌గానే కాకుండా బికినీ వేసి ఓ టైమ్‌లో వెండితెరను వేడెక్కించారు కూడా. ఓ పెద్ద హీరో ఇచ్చిన సలహా మేరకు పూర్తిగా గ్లామర్ బాట వదిలేసి నటన వైపు వచ్చారు. అప్పట్నుంచి వందల సినిమాల్లో తనదైన ముద్ర వేశారు జయసుధ.
కొన్నాళ్లుగా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు జయసుధ. మహేష్ ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్’ తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఈ మధ్య ఆమె ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడూ జయసుధకు సంబంధించి కొన్ని ఫొటోలు బయటకు రాగా, అవి చూసి ప్రేక్షకులు షాక్ అయిపోయారు. జయసుధ ఇలా అయిపోయిందేంటని ఆశ్చర్యపోతున్నారు.
అనారోగ్యం కారణంగా ఇలా మారిపోయారా లేదంటే వయసు రీత్యా ఇలా అయిపోయారా.. అనేది అర్థం కాక అభిమానులు సందిగ్ధంలో పడిపోయారు. రీసెంట్‌గా జయసుధ స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమె అనారోగ్యంతో ఉన్నారా.. జయసుధకు ఏమైంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే జయసుధకు ఏం కాలేదు.. కొన్ని నెలలుగా అలాగే ఉన్నారు ఆవిడ.. అంటూ సన్నిహితులు చెబుతున్నారు. తన ఆరోగ్యంపై జయసుధ పూర్తి క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…