Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీజన్‌లో మోడలింగ్ తరపున జస్వంత్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. మొదట్లో బాగానే గేమ్ ఆడిన జస్వంత్ తర్వాత చాలా డల్ అయ్యాడు. వర్టిగో అనే వ్యాధితో బాధపడుతున్న జస్వంత్ కొన్నాళ్లు సీక్రెట్ రూంలో ఉన్నాడు. అనారోగ్యంతో జస్వంత్ గేమ్ ఆడలేడని భావించిన టీం అతనిని ఎలిమినేట్ చేసింది.
జస్వంత్ మొదటి వారంలో అనీ మాస్టర్‌తో, ఆ తర్వాత శ్రీరామ్‌తో గొడవ పడిన తీరుతో విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత మళ్లీ ఫైటర్‌గా పేరు తెచ్చుకునేంత ఆడాడు. అయితే, షణ్ముఖ్, సిరితో కలిసే ఉంటూ త్రిమూర్తుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆరంభంలోనే కెప్టెన్ అయిన అతడు.. ప్రతి టాస్కులోనూ వందకు వంద శాతం ఇస్తూ సత్తా చాటాడు. అప్పట్లో అతడిని ఆరోగ్య సమస్యలు వెంటాడినా ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేశాడు. దీంతో చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు.
పదో వారం ఇంటి నుంచి బయటకు వచ్చిన జస్వంత్ సెలెబ్రిటీగా మారాడు. అతడు తీరక లేకుండా తిరుగుతున్నాడు. విజయవాడలో అతడితో ర్యాలీని కూడా చేశారు అక్కడి స్థానికులు. ఇక తోటి కంటెస్టెంట్లతో కలిసి జెస్సీ తరచూ పార్టీలు చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తున్నాడు.
ఇటీవల జెస్సీ.. శ్వేతా వర్మ, అషు రెడ్డితో ఓ పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్వేతా ఓ వీడియో రికార్డ్ చేసింది. ఇందులో అతడు.. ఆమెకు ఐలవ్యూ అంటూ పలుమార్లు ప్రపోజ్ చేశాడు. అలాగే, ఫ్లయింగ్ కిస్‌లు కూడా ఇచ్చి షాకిచ్చాడు. జెస్సీ అనుకున్నంత అమాయకుడేమీ కాదంటూ.. నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…