Bigg Boss 5 : జెస్సీ మ‌రీ ఇంత‌లా రెచ్చిపోతున్నాడేంటి.. శ్వేత‌కు ఐల‌వ్ యూ అంటూ ప్రపోజ్..

November 24, 2021 4:38 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సీజ‌న్‌లో మోడలింగ్ త‌ర‌పున జ‌స్వంత్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. మొద‌ట్లో బాగానే గేమ్ ఆడిన జ‌స్వంత్ త‌ర్వాత చాలా డ‌ల్ అయ్యాడు. వ‌ర్టిగో అనే వ్యాధితో బాధపడుతున్న జస్వంత్ కొన్నాళ్లు సీక్రెట్ రూంలో ఉన్నాడు. అనారోగ్యంతో జ‌స్వంత్ గేమ్ ఆడ‌లేడ‌ని భావించిన టీం అత‌నిని ఎలిమినేట్ చేసింది.

Bigg Boss 5 jessie proposed to swetha fans are surprised

జ‌స్వంత్ మొదటి వారంలో అనీ మాస్టర్‌తో, ఆ తర్వాత శ్రీరామ్‌తో గొడవ పడిన తీరుతో విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత మళ్లీ ఫైటర్‌గా పేరు తెచ్చుకునేంత ఆడాడు. అయితే, షణ్ముఖ్, సిరితో కలిసే ఉంటూ త్రిమూర్తుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆరంభంలోనే కెప్టెన్ అయిన అతడు.. ప్రతి టాస్కులోనూ వందకు వంద శాతం ఇస్తూ సత్తా చాటాడు. అప్పట్లో అతడిని ఆరోగ్య సమస్యలు వెంటాడినా ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేశాడు. దీంతో చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు.

పదో వారం ఇంటి నుంచి బయటకు వ‌చ్చిన జ‌స్వంత్ సెలెబ్రిటీగా మారాడు. అతడు తీరక లేకుండా తిరుగుతున్నాడు. విజయవాడలో అతడితో ర్యాలీని కూడా చేశారు అక్కడి స్థానికులు. ఇక తోటి కంటెస్టెంట్లతో కలిసి జెస్సీ తరచూ పార్టీలు చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్స్ కూడా ఇస్తున్నాడు.

ఇటీవల జెస్సీ.. శ్వేతా వర్మ, అషు రెడ్డితో ఓ పార్టీ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే శ్వేతా ఓ వీడియో రికార్డ్ చేసింది. ఇందులో అతడు.. ఆమెకు ఐలవ్యూ అంటూ పలుమార్లు ప్రపోజ్ చేశాడు. అలాగే, ఫ్లయింగ్ కిస్‌లు కూడా ఇచ్చి షాకిచ్చాడు. జెస్సీ అనుకున్నంత అమాయ‌కుడేమీ కాదంటూ.. నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now