Jayasudha : జ‌య‌సుధ‌కు ఏమైంది.. ముఖం ఇలా మారిపోయిందేంటి ?

November 24, 2021 3:59 PM

Jayasudha : స‌హ‌జ‌న‌టి జయ‌సుధ త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు. ఇప్ప‌టికీ ఈమె అంటే ఎంతో మందికి చెప్పలేనంత అభిమానం ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా సంచలనాలు రేపారు జయసుధ. కేవలం హోమ్లీ హీరోయిన్‌గానే కాకుండా బికినీ వేసి ఓ టైమ్‌లో వెండితెరను వేడెక్కించారు కూడా. ఓ పెద్ద హీరో ఇచ్చిన సలహా మేరకు పూర్తిగా గ్లామర్ బాట వదిలేసి నటన వైపు వచ్చారు. అప్పట్నుంచి వందల సినిమాల్లో తనదైన ముద్ర వేశారు జయసుధ.

Jayasudha new look creating worry in fans

కొన్నాళ్లుగా సపోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ వ‌స్తున్నారు జ‌య‌సుధ‌. మ‌హేష్‌ ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్‌’ తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఈ మధ్య ఆమె ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. అప్పుడ‌ప్పుడూ జ‌య‌సుధ‌కు సంబంధించి కొన్ని ఫొటోలు బ‌య‌ట‌కు రాగా, అవి చూసి ప్రేక్ష‌కులు షాక్ అయిపోయారు. జ‌య‌సుధ ఇలా అయిపోయిందేంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

అనారోగ్యం కారణంగా ఇలా మారిపోయారా లేదంటే వయసు రీత్యా ఇలా అయిపోయారా.. అనేది అర్థం కాక అభిమానులు సందిగ్ధంలో పడిపోయారు. రీసెంట్‌గా జ‌య‌సుధ స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోను షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమె అనారోగ్యంతో ఉన్నారా.. జయసుధకు ఏమైంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే జయసుధకు ఏం కాలేదు.. కొన్ని నెలలుగా అలాగే ఉన్నారు ఆవిడ.. అంటూ సన్నిహితులు చెబుతున్నారు. త‌న ఆరోగ్యంపై జ‌య‌సుధ పూర్తి క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment