Janhvi Kapoor : పట్టుచీరలో మెరిసిపోతున్న జాన్వీ కపూర్‌.. ఫొటోలు వైరల్‌..!

March 7, 2022 3:01 PM

Janhvi Kapoor : అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తల్లి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న జాన్వీకపూర్ తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది. నిత్యం గ్లామరస్ ఫోటోలతో సందడి చేసే జాన్వీకపూర్ మొట్టమొదటిసారిగా సాంప్రదాయబద్ధంగా పట్టు చీర కట్టుకొని కుందనపు బొమ్మలా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Janhvi Kapoor in saree visiting Tirumala photos viral
Janhvi Kapoor

జాన్వీ కపూర్ తన 25వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమాని ఏకంగా ఈ ముద్దుగుమ్మతో కేక్ కట్ చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా జాన్వీకపూర్ తన 25వ పుట్టినరోజు వేడుకల కోసం తిరుపతికి వచ్చింది.

ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఈమె స్వామివారిని దర్శించుకుంది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా పట్టు చీర కట్టుకొని బాపుబొమ్మలా ఉన్న జాన్వీ కపూర్ తన స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ క్రమంలోనే ఈమె ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ॐ శ్రీ వేంకటేశ్వరాయే నమో నమః శ్రీమన్ నారాయణ నమో నమః తిరుమల తిరుపతి నమో నమః’ అంటూ క్యాప్షన్ పెడుతూ ఆ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment