Jabardasth : వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న రష్మి.. ఏదైనా గతం ఉందా ?

October 2, 2021 2:27 PM

Jabardasth : బుల్లితెరపై ప్రముఖ యాంకర్ గా కొనసాగుతున్న వారిలో యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ రష్మికి, సుడిగాలి సుధీర్ కు మధ్య ఏదో ఉంది.. అంటూ వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందని ప్రేక్షకులు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని కార్యక్రమాలలో వీరిద్దరూ పెళ్లి స్కిట్ ద్వారా సందడి చేస్తూ అభిమానులను అలరించారు.

Jabardasth : వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న రష్మి.. ఏదైనా గతం ఉందా ?

ఇకపోతే రష్మి ప్రతి వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ వేదికపై యాంకర్ గా కొనసాగుతూ తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఏ విషయాన్ని అయినా ముక్కుసూటితనంగా తీసుకునే రష్మి కొన్ని విషయాలలో చాలా తొందరగా ఎమోషనల్ అవుతుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్స్ ట్రా జబర్దస్త్ వేదికపై ఉన్న ఫలంగా కన్నీటి పర్యంతం అయ్యింది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

ఈ ప్రోమోలో భాగంగా రాకింగ్ రాకేష్ రోహిణికి తన ఐదు సంవత్సరాల పరిచయానికి గుర్తుగా తనకు ఐదు రకాల గిఫ్టులను ఇస్తూ ప్రపోజ్ చేస్తూ స్కిట్ చేశాడు. అంతవరకూ ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉన్న రష్మి ఈ సన్నివేశం చూసే సరికి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. మరి రష్మి ఏడవడానికి కారణం ఏంటి ? అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now