Jabardasth Rakesh : ఈ మధ్య కాలంలో రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాలు తమ ప్రోగ్రాం టీర్పీలు పెంచుకోవడం కోసం రీల్ లవ్ స్టోరీలతో మంచి హడావిడి క్రియేట్ చేస్తున్నారు. ఏది నిజమో నమ్మలేని అయోమయ స్థితిలో పడేస్తూ ఉంటారు ప్రేక్షకులని. కార్యక్రమాలకు టీఆర్పీలను పెంచుకోవడం కోసం డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ టీమ్స్ వారు కొత్త పద్ధతులను అవలంబిస్తుంటారు. మల్లెమాల నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్, రష్మీ జంట, అదేవిధంగా ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ఆన్ స్క్రీన్ లో నటిస్తారు.
కానీ వీరందరిది కేవలం నటన మాత్రమే.. షో కోసం అలా లవర్స్‌గా నటిస్తుంటారు. కానీ జబర్దస్త్‌లో షోలో రియల్ లవర్స్ కూడా ఉన్నారు. వారే రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత జంట. ప్రారంభంలో చూసే ప్రేక్షకులు అందరూ వీరిద్దరిని కూడా రీల్ కపుల్ అనుకున్నారు. కానీ ఈ ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వారిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టడం జరిగింది. అదే సమయంలో స్టేజి మీదే సుజాతకు రింగ్ తొడిగి మరీ ప్రపోజ్ చేసి.. తాము నిజంగానే ప్రేమించుకుంటున్నాం అని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. త్వరలోనే తాము వివాహం చేసుకోబోతున్నట్లు సుజాత కూడా ప్రకటించింది. ఈ విషయం గురించి సుజాత తన యూట్యూబ్ చానల్‌లో వెల్లడించింది.
ఈ క్రమంలో రాకేష్ తో తన ప్రేమ, పెళ్లి గురించి ఇంత త్వరగా అందరికి చెప్పడానికి కారణం రోజా అన్నారు. మా మధ్య ప్రేమకు కారణం కూడా రోజానే అని తెలిపింది సుజాత. తాజాగా సుజాత తన యూట్యూబ్ చానెల్ లో రోజా హోమ్ టూర్ వీడియోని పోస్ట్ చేసింది. దీనిలో నేను, రాకేష్ ప్రేమించుకుంటున్నాం అనే విషయాన్ని ముందుగా రోజానే గుర్తించారని చెప్పింది సుజాత. ఆమె ప్రోత్సాహం వల్లే తమ ప్రేమ, పెళ్లి గురించి ఇంత త్వరగా ప్రకటించామని తెలియజేసింది. ఇక త్వరలోనే తమ పెళ్లి తేదీని ప్రకటిస్తామని సుజాత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…