Jabardasth Rakesh : రోజా వ‌ల్లే ఆ విష‌యం బ‌య‌ట ప‌డింది.. జోర్దార్ సుజాత‌, రాకేష్‌..

September 22, 2022 2:15 PM

Jabardasth Rakesh : ఈ మధ్య కాలంలో రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాలు తమ ప్రోగ్రాం టీర్పీలు పెంచుకోవడం కోసం రీల్‌ లవ్‌ స్టోరీలతో మంచి హడావిడి క్రియేట్ చేస్తున్నారు. ఏది నిజమో నమ్మలేని అయోమయ స్థితిలో పడేస్తూ ఉంటారు ప్రేక్షకులని. కార్యక్రమాల‌కు టీఆర్పీల‌ను పెంచుకోవడం కోసం డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ టీమ్స్ వారు కొత్త పద్ధతులను అవలంబిస్తుంటారు. మల్లెమాల నిర్వహించే జబర్దస్త్ షో ద్వారా సుడిగాలి సుధీర్, రష్మీ జంట, అదేవిధంగా ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ఆన్  స్క్రీన్ లో నటిస్తారు.

కానీ వీరందరిది కేవలం నటన మాత్రమే.. షో కోసం అలా లవర్స్‌గా నటిస్తుంటారు. కానీ జబర్దస్త్‌లో షోలో రియల్‌ లవర్స్‌ కూడా ఉన్నారు. వారే రాకింగ్‌ రాకేష్‌-జోర్దార్‌ సుజాత జంట. ప్రారంభంలో చూసే ప్రేక్షకులు అందరూ వీరిద్దరిని కూడా రీల్‌ కపుల్‌ అనుకున్నారు. కానీ ఈ ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వారిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టడం జరిగింది. అదే సమయంలో స్టేజి మీదే సుజాతకు రింగ్‌ తొడిగి మరీ ప్రపోజ్ చేసి.. తాము నిజంగానే ప్రేమించుకుంటున్నాం అని ప్రకటించి అందరికీ షాక్‌ ఇచ్చారు. త్వరలోనే తాము వివాహం చేసుకోబోతున్నట్లు సుజాత కూడా ప్రకటించింది. ఈ విషయం గురించి సుజాత తన యూట్యూబ్ చాన‌ల్‌లో వెల్లడించింది.

Jabardasth Rakesh and jordar sujatha told about roja
Jabardasth Rakesh

ఈ క్రమంలో రాకేష్ తో తన ప్రేమ, పెళ్లి గురించి ఇంత త్వరగా అందరికి చెప్పడానికి కారణం రోజా అన్నారు. మా మధ్య ప్రేమకు కారణం కూడా రోజానే అని తెలిపింది సుజాత. తాజాగా సుజాత తన యూట్యూబ్‌ చానెల్ లో రోజా హోమ్‌ టూర్‌ వీడియోని పోస్ట్ చేసింది. దీనిలో నేను, రాకేష్‌ ప్రేమించుకుంటున్నాం అనే విషయాన్ని ముందుగా రోజానే గుర్తించారని చెప్పింది సుజాత. ఆమె ప్రోత్సాహం వల్లే తమ ప్రేమ, పెళ్లి గురించి ఇంత త్వరగా ప్రకటించామని తెలియజేసింది. ఇక త్వరలోనే తమ పెళ్లి తేదీని ప్రకటిస్తామని సుజాత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now