Upasana Konidela : మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ చరణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఓ వైపు నటన పరంగా తండ్రిని మించిపోగా.. సామాజిక సేవలోనూ తండ్రి పేరు నిలబెడుతున్నాడు. తన భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకుంటున్నాడు. ఈ మధ్యే చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
చరణ్ ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంతోనే అభిమానులను సంపాదించుకున్నాడు. తరువాత మగధీర సినిమాతో అంచనాలను దాటి వెళ్లిపోయాడు. చరణ్ నటన, డ్యాన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇక మగధీర తరువాత చరణ్ వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. రంగస్థలం మూవీతో తనలోని నటున్ని చరణ్ ఆవిష్కరించాడు. ఇక ఉపాసన కూడా చరణ్‌కు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటోంది. చరణ్‌కు ఉన్న బిజినెస్‌లతోపాటు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా ఉపాసన చూస్తోంది. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఉపాసన చురుగ్గా పాల్గొంటోంది.
అయితే చరణ్, ఉపాసన వాస్తవానికి చిన్ననాటి నుంచే స్నేహితులు. తరువాత ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇక వయస్సులో చరణ్ చిన్నవాడు. ఉపాసన నే పెద్ద. ఆమెకు, అతనికి వయస్సులో 4 ఏళ్ల తేడా ఉంది. చరణ్ కన్నా ఉపాసన వయస్సులో 4 ఏళ్లు పెద్ద కావడం విశేషం. అయినప్పటికీ ఇద్దరూ ప్రేమించుకున్నారు కనుక.. వారి వయస్సు తేడా చూడకుండా వారి పెద్దలు వారికి వివాహం జరిపించారు.
అయితే ఇటీవల గణేష్ నవరాత్రుల సందర్భంగా ఉపాసన ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. ఆమె బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. దీంతో ఆమె గర్భం ధరించిందా.. అని అందరూ ఆరాలు తీస్తున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. తరువాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ లతో మూవీలు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలపై క్లారిటీ రావల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…