సాధారణంగా ఐస్క్రీమ్ ధర ఎంత ఉంటుంది అంటే మహా అయితే వందల్లో ఉంటుందని చెబుతారు. ఐస్క్రీమ్ మనకు వివిధ రకాల ఫ్లేవర్ లలో, వివిధ రకాల రుచులను కలిగి ఉంటుంది కనుక కొంతవరకు ధర పెట్టవచ్చు. అయితే ఒక ఐస్ క్రీమ్ ధర 60 వేల రూపాయలు ఉంటుందంటే మీరు నమ్ముతారా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. మరి అంత ధర కలిగిన ఐస్ క్రీమ్ ఏమిటి ?దాని ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇంత ఖరీదు చేసే ఈ ఐస్ క్రీమ్ పేరు “బ్లాక్ డైమండ్” అయితే ఇది సాధారణ ఐస్ క్రీమ్ మాదిరిగా ఉంటుందనుకుంటే పొరపాటే. ఈ ఐస్ క్రీమ్ పై 23 క్యారట్ల బంగారు రేకులను చల్లడం వల్ల ఐస్ క్రీమ్ అంత ధర పలుకుతోంది. బంగారు రేకులను మనం తినవచ్చా..? అనే సందేహం మీకు కలగొచ్చు.. ఆ బంగారు రేకులను ఏమాత్రం సందేహం పడకుండా తినవచ్చు. ఇంత ప్రత్యేకమైన ఈ ఐస్ క్రీమ్ తినాలంటే తప్పకుండా మీరు దుబాయ్ వెళ్లాల్సిందే.
దుబాయ్ లోని ‘స్కూపీ కేఫ్’లో మాత్రమే ఈ ప్రత్యేకమైన ఐస్ క్రీమ్ ను తయారు చేస్తారు. తాజాగా నటి షెనాజ్ ట్రెజరీ దుబాయ్ పర్యటనలో భాగంగా ఈ కేఫ్ ను సందర్శించి “బ్లాక్ డైమండ్” ఐస్ క్రీమ్ రుచిని చూశారు. ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ రూ.60 వేల రూపాయల ఖరీదు చేసే ఐస్ క్రీమ్ రుచి చూశానని తెలిపారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…