ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్.. దీని ధర తెలిస్తే కళ్ళు తిరుగుతాయ్..

July 22, 2021 6:18 PM

సాధారణంగా ఐస్క్రీమ్ ధర ఎంత ఉంటుంది అంటే మహా అయితే వందల్లో ఉంటుందని చెబుతారు. ఐస్క్రీమ్ మనకు వివిధ రకాల ఫ్లేవర్ లలో, వివిధ రకాల రుచులను కలిగి ఉంటుంది కనుక కొంతవరకు ధర పెట్టవచ్చు. అయితే ఒక ఐస్ క్రీమ్ ధర 60 వేల రూపాయలు ఉంటుందంటే మీరు నమ్ముతారా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. మరి అంత ధర కలిగిన ఐస్ క్రీమ్ ఏమిటి ?దాని ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంత ఖరీదు చేసే ఈ ఐస్ క్రీమ్ పేరు “బ్లాక్ డైమండ్” అయితే ఇది సాధారణ ఐస్ క్రీమ్ మాదిరిగా ఉంటుందనుకుంటే పొరపాటే. ఈ ఐస్ క్రీమ్ పై 23 క్యారట్ల బంగారు రేకులను చల్లడం వల్ల ఐస్ క్రీమ్ అంత ధర పలుకుతోంది. బంగారు రేకులను మనం తినవచ్చా..? అనే సందేహం మీకు కలగొచ్చు.. ఆ బంగారు రేకులను ఏమాత్రం సందేహం పడకుండా తినవచ్చు. ఇంత ప్రత్యేకమైన ఈ ఐస్ క్రీమ్ తినాలంటే తప్పకుండా మీరు దుబాయ్ వెళ్లాల్సిందే.

దుబాయ్ లోని  ‘స్కూపీ కేఫ్’లో మాత్రమే ఈ ప్రత్యేకమైన ఐస్ క్రీమ్ ను తయారు చేస్తారు. తాజాగా నటి షెనాజ్ ట్రెజరీ దుబాయ్ పర్యటనలో భాగంగా ఈ కేఫ్ ను సందర్శించి “బ్లాక్ డైమండ్” ఐస్ క్రీమ్ రుచిని చూశారు. ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ రూ.60 వేల రూపాయల ఖరీదు చేసే ఐస్ క్రీమ్ రుచి చూశానని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now