లక్షల‌ కరోనా మరణాలను దాచారు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

May 16, 2021 6:25 PM

గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ బారినపడి లక్షల సంఖ్యలో ప్రాణాలను కోల్పోయారు. మొదటిదశ కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఫ్రాన్స్, యూకే, ఇటలీ, రష్యా వంటి దేశాలలో మరణాల సంఖ్య అధికంగా ఉండేది. రెండవ దశ వ్యాపిస్తున్న సమయంలోనూ మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఇక ఇండియాలో రెండవ దశ తీవ్ర రూపం దాలుస్తుంది. రెండవ దశ వ్యాపిస్తున్న తరుణంలో రోజుకు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.

ఈ క్రమంలోనే వివిధ దేశాలలో కరోనా మరణాలు గురించి ఆయా దేశాలు ప్రకటిస్తున్న గణాంకాలు పూర్తిగా అసత్యమేనని, ప్రభుత్వం తెలిపిన గణాంకాలకు రెండు రెట్లు అధికంగా మరణాలు సంభవించి ఉంటాయని వాష్టింగ్టన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ అధ్యయనం చెబుతోంది.

భారత దేశంతో సహా అమెరికా, రష్యా, దేశాలు చూపిస్తున్న మరణాల గణాంకాల కన్నా రెండింతలు ఎక్కువగా మరణాలు సంభవించినట్లు ఈ నివేదిక పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల డేటాను అధ్యయనం చేసిన ఈ సంస్థ లక్షలు కరోనా మరణాలను దాచేశారనే విషయాన్ని బయట పెట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment