‘ఫ్లైట్’లో అసహ్యంగా ప్రవర్తించిన దంపతులు.. చూడలేక ఎయిర్ హోస్టెస్ ఏం చేసిందంటే?

May 28, 2021 4:19 PM

పాకిస్థాన్ కి చెందిన ఓ జంట విమానంలో చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానం ఎక్కినప్పటి నుంచి ఆ జంట ప్రవర్తించిన తీరు సాటి ప్రయాణికులకు ఎంతో ఇబ్బందికరంగా మారింది.విమానంలో ఉన్నామనే విషయాన్ని కూడా ఆ జంట మర్చిపోయి విమానం ఎక్కినప్పటి నుంచి ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయారు. ఈ జంట ప్రవర్తన చూసి విసుగు చెందిన ఓ సాటి ప్యాసింజర్ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే కరాచీ- ఇస్లామాబాద్‌కు వెళ్తున్న పీఏ-200 ఫ్లైట్‌లో ఒక కపుల్‌ నాలుగో వరుసలో కూర్చున్న ఈ జంట విమానం ఎక్కినప్పటినుంచి ఒకరికొకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు.ఈ క్రమంలోనే వారి వెనుక కూర్చున్న ప్రయాణికుడు వారి చేష్టలు విసుగు చెంది ఎయిర్ హోస్టస్‌ను పిలిచి అసలు విషయం తెలిపాడు. ఈ క్రమంలోనే ఆమె వెళ్లి మీ చర్యలతో పక్క వారికి ఎంతో ఇబ్బందిగా ఉంది,ఇలాంటివి చేయకూడదని వారికి హెచ్చరించిన వారు ఆమె మాటలను పట్టించుకోలేదు.

ఈ క్రమంలోనే ఎయిర్ హోస్ట్ వారికి ఒక బ్లాంకెట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారు ప్రయాణిస్తున్న విమానంలోనే బిలాల్‌ ఫరూక్‌ ఆల్వీ అనే అడ్వకేట్‌ కూడా ఉన్నారు. వారి చేస్తున్న పనిపై విమాన సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫరూక్ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మరోసారి ఎప్పుడైనా పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment