పర్యావరణం సురక్షితంగా ఉండాలన్నా, మానవాళి మనుగడ సాగించాలన్నా, సమస్త ప్రాణికోటికి.. చెట్లు ఎంతో కీలకం. చెట్లు లేకపోతే పర్యావరణం దెబ్బతింటుంది. జీవవైవిధ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. దీంతో విపత్తులు వస్తాయి. అయితే అభివృద్ధి పేరిట చెట్లను నరకడం మాత్రం సమంజసం కాదు. అభివృద్ధిని అందరూ కోరుకుంటారు, కానీ చెట్లను నరకడం సరికాదు. సరిగ్గా ఈ విషయాన్ని నమ్మారు కాబట్టే వారు అభివృద్ది లేకపోయినా ఫర్వాలేదు కానీ చెట్లను మాత్రం నరకవద్దని కోరుతున్నారు.
ఛత్తీస్‌గడ్‌లోని బలోద్ జిల్లాలో రహదారి నిర్మాణం కోసం 2900 చెట్లను నరికివేయనున్నారు. అయితే రహదారి నిర్మాణం మంచిదే కానీ, చెట్లను నరికితే ఎలా ? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అధికారులు 2900 చెట్లు అంటున్నారు కానీ వాటి సంఖ్య 20వేల కన్నా ఎక్కువగానే ఉంటుందని స్థానిక కార్యకర్త వీరేంద్ర సింగ్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే చెట్లను కాపాడేందుకు ఆయన స్థానికులతో కలిసి వినూత్న ఆలోచన చేశారు.
చెట్లను నరికివేయకుండా ఉండేందుకుగాను వారు చెట్లపై దేవుళ్ల బొమ్మలను అంటించడం మొదలు పెట్టారు. ఈ సందర్బంగా వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. బలూద్ జిల్లాలో తారౌద్ నుండి డైహాన్ వరకు 8 కిలోమీటర్ల రహదారిని నిర్మించాలని ప్రజా పనుల శాఖ ప్రతిపాదించిందని, అయితే ఆ దారి పొడవునా 20వేల చెట్లను నరికివేయనున్నారని, అందుకనే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం రెండూ అటవీ నిర్మూలనకు కారణమని, భూగ్రహాన్ని సురక్షితంగా ఉంచేందుకు మనం చెట్లను కాపాడాలని సింగ్ అన్నారు. మేం చిప్కో ఉద్యమంతో ప్రారంభించాం, తరువాత కూడళ్ల వద్ద పోస్టర్ బ్యానర్ల ద్వారా, తరువాత రక్షా సూత్రాన్ని కట్టడం ద్వారా, ఇప్పుడు నరికివేసే అన్ని చెట్లపై శివుడి ఫోటోలను అతికించడం ద్వారా.. చెట్లను నరికివేయడాన్ని నిరసిస్తున్నాం.. అని ఆయన అన్నారు.
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…