మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులా ? మీ డెబిట్ కార్డు పోయిందా ? లేక దెబ్బ తిందా ? కార్డు సరిగ్గా పనిచేయడం లేదా ? అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొత్త కార్డును సులభంగానే పొందవచ్చు. అందుకు ఎస్‌బీఐ పలు సదుపాయాలను అందిస్తోంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ వినియోగదారులు ఆ బ్యాంక్ అందిస్తున్న ఐవీఆర్ కాల్ సదుపాయాన్ని ఉపయోగించి తిరిగి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కస్టమర్లు తమ ఎస్‌బీఐ డెబిట్ కార్డును కోల్పోతే లేదా కార్డు దెబ్బతిన్నట్లయితే కొత్త కార్డును పొందడానికి వారు బ్యాంక్ శాఖకు పరుగెత్తాల్సిన అవసరం లేదు. వారు తమ రిజిస్టర్ చేయబడిన ఫోన్ నంబర్ నుండి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేసి అక్కడ చెప్పే ప్రాంప్ట్ చేసిన సూచనలను అనుసరించాలి. దీంతో కార్డును సులభంగా బ్లాక్ చేయడంతోపాటు కొత్త కార్డును పొందవచ్చు. అందుకుగాను ఎస్‌బీఐ రెండు టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. అవి – 1800 112 211 లేదా 1800 425 3800. ఇందులో దేనికి అయినా సరే ఎస్‌బీఐ వినియోగదారులు కాల్ చేసి సహాయం పొందవచ్చు.
స్టెప్ 1: మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 1800 112 211 లేదా 1800 425 3800 కు డయల్ చేయండి.
స్టెప్ 2: ప్రాంప్ట్ చేసినప్పుడు కార్డ్ బ్లాకింగ్ కోసం 0 బటన్‌ను నొక్కండి.
స్టెప్: 3: మీ ఎస్బీఐ డెబిట్ కార్డును బ్లాక్ చేయడానికి ఐవీఆర్ కాల్ మీకు రెండు మార్గాలు ఇస్తుంది. మొదటి ఎంపిక కోసం, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, డెబిట్ కార్డ్ నంబర్ ఉపయోగించి కార్డ్ బ్లాకింగ్ కోసం 1 నొక్కాలి. రెండవ ఎంపిక కోసం, మీరు 2 నొక్కాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించాలి. అనంతరం కార్డును బ్లాక్ చేసే ప్రక్రియ కోసం మీ ఖాతా నంబర్‌ను నమోదు చేయాలి.
స్టెప్ 4: ఆప్షన్‌లో 1 ని ఎంచుకుంటే, మీరు మీ డెబిట్ కార్డు చివరి 5 అంకెలను నమోదు చేయాలి. నిర్ధారణ కోసం కాల్ చివరిలో 1 నొక్కాలి. 2 ను ఎంచుకుంటే మీరు ధృవీకరణ కోసం ఖాతా సంఖ్యకు చెందిన చివరి 5 అంకెలను నమోదు చేయాలి.
స్టెప్ 5: మీ కార్డ్ విజయవంతంగా బ్లాక్ చేయబడుతుంది. మీరు దానిని ధృవీకరించే SMS ను పొందుతారు.
ఒకవేళ మీరు కొత్త కార్డు ఇష్యూ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, తదుపరి ప్రాసెసింగ్ కోసం మీరు 1 నొక్కాలి.
స్టెప్ 1: కొత్త కార్డు జారీ చేయాలనే అభ్యర్థనతో మరింత ముందుకు వెళ్ళడానికి, మీరు మీ పుట్టిన సంవత్సరాన్ని నమోదు చేయాలి.
స్టెప్ 2: నిర్ధారించడానికి 1 లేదా అభ్యర్థనను రద్దు చేయడానికి 2 నొక్కాలి.
స్టెప్ 3: మీరు అభ్యర్థనను ధృవీకరిస్తే, మీరు దాని కోసం నిర్ధారణ SMS ను పొందుతారు.
కొత్త డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేశాక కార్డును మంజూరు చేసేందుకు మీ బ్యాంక్ ఖాతా నుండి కార్డ్ కు చెందిన ఫీజు వసూలు చేయబడుతుంది. బ్యాంకులో నమోదు అయి ఉన్న మీ రిజిస్టర్డ్ చిరునామాకు కొత్త డెబిట్ కార్డు పంపబడుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…