పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నారా ? అయితే మీకు గుడ్ న్యూస్.. ఇకపై మీరు మీకు దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్‌లోనూ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు గాను విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఇండియా పోస్ట్ తో కలిసి సేవను అందిస్తోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని వివిధ పోస్టాఫీసులలో పాస్‌పోర్ట్ దరఖాస్తు సౌకర్యాన్ని పొంందవచ్చు. ఈ క్రమంలో పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
దరఖాస్తుదారులు తమకు సమీపంలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి అక్కడ ఉండే సాధారణ సేవా కేంద్రం లేదా సీఎస్ఎస్ కౌంటర్‌లో సంప్రదించాలి. దీంతో పాస్ పోర్టుకు దరఖాస్తు చేయవచ్చు. ఈ మేరకు ఇండియా పోస్ట్ ఒక ట్వీట్ ద్వారా వివరాలను వెల్లడించింది.
భారతదేశంలో పాస్‌పోర్టు ప్రతి భారతీయ పౌరుడికి అత్యంత కీలకమైన పత్రాలలో ఒకటి. ఎందుకంటే ఇది గుర్తింపు కోసమే కాదు, అంతర్జాతీయ ప్రయాణానికి కీలకమైన పత్రం కూడా. ఇది హోల్డర్‌కు విదేశాలకు వెళ్లడానికి వీలు కల్పిస్తుంది. ఏ విదేశీ దేశంలోనైనా భారతీయ పౌరుడిగా ఉండటానికి రుజువుగా పనిచేస్తుంది.
పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు దరఖాస్తుదారు అనేక ముఖ్యమైన పత్రాలను సమర్పించాలి. ఆధార్ కార్డు, ఎన్నికల ఓటరు ఐడీ కార్డు లేదా ఏదైనా చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ కార్డు వంటి గుర్తింపు పత్రాలను ఇవ్వాలి. అలాగే వయస్సు రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం, పాఠశాల టీసీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇక చిరునామా రుజువుగా విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, గ్యాస్ కనెక్షన్, మొబైల్ బిల్లు వంటివి అందజేయవచ్చు. దీంతోపాటు బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై ఉన్న పాస్‌బుక్ కాపీ కూడా చెల్లుతుంది. అలాగే అద్దె ఒప్పంద పత్రాన్ని కూడా సమర్పించవచ్చు.
పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఆన్‌లైన్ చేసింది. కాబట్టి మీరు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారా ముందుకు సాగాలి. దాని కోసం కింద తెలిపిన స్టెప్స్‌ను అనుసరించాలి.
స్టెప్ 1: పాస్‌పోర్ట్ సేవ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. (passportindia.gov.in)
స్టెప్ 2: మీరు ఇప్పటికే ఉన్న యూజర్ అయితే పాత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వవచ్చు. కానీ మీరు మొదటిసారిగా యూజర్ అయితే ఆ సైట్‌లో కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి.
స్టెప్ 3: హోమ్ పేజీలో న్యూ యూజర్ టాబ్ కింద రిజిస్టర్ నౌ పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఆపై ధృవీకరణ కోసం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, రిజిస్టర్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: ఇప్పుడు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీతో పాస్‌పోర్ట్ సేవ ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
స్టెప్ 6: లాగిన్ అయిన తరువాత అందించిన ఆప్షన్‌ల నుండి ఫ్రెష్ పాస్‌పోర్ట్ లేదా పాస్‌పోర్ట్ రెన్యువల్ అనే లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 7: జాగ్రత్తగా దరఖాస్తు ఫారంలో అవసరమైన వివరాలను నింపండి. అప్‌లోడ్ ఈ-ఫాం లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 8: తరువాత వ్యూ సేవ్ / సమర్పించిన అప్లికేషన్ స్క్రీన్‌లో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడానికి పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 9: చివరగా, అప్లికేషన్ రశీదును ప్రింటౌట్ తీసుకోవడానికి ప్రింట్ అప్లికేషన్ రిసీట్ లింక్‌పై క్లిక్ చేయండి. రశీదులో అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ లేదా అపాయింట్‌మెంట్ నంబర్ ఉంటుంది. అది భవిష్యత్ రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…