చెట్ల‌ను న‌రికివేయ‌కుండా వినూత్న ఆలోచ‌న‌.. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల‌ని ఆ గ్రామ వాసుల పిలుపు..

July 25, 2021 8:21 PM

ప‌ర్యావ‌ర‌ణం సుర‌క్షితంగా ఉండాల‌న్నా, మాన‌వాళి మనుగ‌డ సాగించాల‌న్నా, స‌మ‌స్త ప్రాణికోటికి.. చెట్లు ఎంతో కీల‌కం. చెట్లు లేక‌పోతే ప‌ర్యావ‌రణం దెబ్బ‌తింటుంది. జీవ‌వైవిధ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. దీంతో విపత్తులు వ‌స్తాయి. అయితే అభివృద్ధి పేరిట చెట్ల‌ను న‌ర‌క‌డం మాత్రం స‌మంజ‌సం కాదు. అభివృద్ధిని అందరూ కోరుకుంటారు, కానీ చెట్ల‌ను న‌ర‌క‌డం స‌రికాదు. స‌రిగ్గా ఈ విష‌యాన్ని న‌మ్మారు కాబ‌ట్టే వారు అభివృద్ది లేక‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ చెట్ల‌ను మాత్రం న‌ర‌క‌వ‌ద్ద‌ని కోరుతున్నారు.

this villagers variety idea of saving trees

ఛత్తీస్‌గడ్‌లోని బలోద్ జిల్లాలో రహదారి నిర్మాణం కోసం 2900 చెట్ల‌ను నరికివేయ‌నున్నారు. అయితే ర‌హ‌దారి నిర్మాణం మంచిదే కానీ, చెట్ల‌ను నరికితే ఎలా ? అని స్థానికులు ప్ర‌శ్నిస్తున్నారు. వాస్త‌వానికి అధికారులు 2900 చెట్లు అంటున్నారు కానీ వాటి సంఖ్య‌ 20వేల క‌న్నా ఎక్కువ‌గానే ఉంటుంద‌ని స్థానిక కార్యకర్త వీరేంద్ర సింగ్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే చెట్ల‌ను కాపాడేందుకు ఆయ‌న స్థానికుల‌తో క‌లిసి వినూత్న ఆలోచ‌న చేశారు.

చెట్ల‌ను న‌రికివేయ‌కుండా ఉండేందుకుగాను వారు చెట్ల‌పై దేవుళ్ల బొమ్మ‌ల‌ను అంటించ‌డం మొద‌లు పెట్టారు. ఈ సంద‌ర్బంగా వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. బలూద్ జిల్లాలో తారౌద్ నుండి డైహాన్ వరకు 8 కిలోమీటర్ల రహదారిని నిర్మించాలని ప్రజా పనుల శాఖ ప్రతిపాదించింద‌ని, అయితే ఆ దారి పొడ‌వునా 20వేల చెట్ల‌ను న‌రికివేయ‌నున్నార‌ని, అందుక‌నే ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టామని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం రెండూ అటవీ నిర్మూలనకు కారణమ‌ని, భూగ్రహాన్ని సుర‌క్షితంగా ఉంచేందుకు మ‌నం చెట్లను కాపాడాల‌ని సింగ్ అన్నారు. మేం చిప్కో ఉద్యమంతో ప్రారంభించాం, తరువాత కూడళ్ల వద్ద పోస్టర్ బ్యానర్ల ద్వారా, తరువాత ర‌క్షా సూత్రాన్ని కట్టడం ద్వారా, ఇప్పుడు న‌రికివేసే అన్ని చెట్లపై శివుడి ఫోటోలను అతికించడం ద్వారా.. చెట్లను నరికివేయడాన్ని నిరసిస్తున్నాం.. అని ఆయన అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment