ఇప్పటి వరకు ఆ ఊరిలో ఒక్క కరోనా కేసులేదు.. కారణం ఏమిటంటే ?

April 25, 2021 10:35 PM

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో రోజురోజుకు కేసుల సంఖ్య అధికం అవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ప్రతిరోజు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎంతో ఎక్కువగా ఉన్నప్పటికీ గుజరాత్లోని రెండు గ్రామాలలో మాత్రం ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

గుజరాత్ లోని షియాల్, అలియా అనే రెండు గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అందుకు గల కారణం ఆ గ్రామస్తులు పాటిస్తున్నటువంటి జాగ్రత్తలు. ఇప్పటికే ఈ చుట్టుపక్కల గ్రామాలలో కరోనా కేసులు అధికమవుతున్న ఈ గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడం గమనార్హం. ఈ రెండు గ్రామాల సర్పంచులు గ్రామ ప్రజల పట్ల తీసుకున్న బాధ్యత దీనికి కారణం అని చెప్పవచ్చు.

గత సంవత్సరం నుంచి ఈ రెండు గ్రామాలలోకి ఇతర వ్యక్తులు ఎవరిని లోపలికి అనుమతించలేదు, అదే విధంగా గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలి. అలాగే క్రమం తప్పకుండా ఊరు మొత్తం శానిటైజ్ చేయటం వల్ల ఈ రెండు గ్రామాలలో ఇప్పటివరకు కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బయట వ్యక్తులు మాత్రమే కాకుండా ఈ గ్రామంలోని ప్రజలు కూడా ఎవరు బయటకు వెళ్లకూడదు అనే ఆంక్షలను విధించారు.

ఈరెండు గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యవసరమైన పరిస్థితులలో సర్పంచ్ అనుమతి తీసుకుని బయటకు వెళ్లాలి.బయటనుంచి వచ్చిన తర్వాత ఆ వ్యక్తులు తమ ఇంటికి కాకుండా క్వారంటైన్ కేంద్రానికి వెళ్లాలి. ఈ విధంగా ఈ రెండు గ్రామాల సర్పంచులు వారి గ్రామ ప్రజల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు, బాధ్యతనే ఇప్పటివరకు ఈ రెండు గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడానికి కారణం అని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment