ఆవు పేడను ఒంటికి రాసుకుంటే కోవిడ్ తగ్గుతుందా ? అంటే.. అక్కడి వాసులు అవుననే అంటున్నారు. అందుకనే వారు రోజూ గంటల తరబడి ఆవు పేడ, మూత్రం కలిపిన మిశ్రమాన్ని ఒంటికి పట్టించుకుంటున్నారు. తరువాత ఆవు పాలు లేదా మజ్జిగతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంత వాసులకు ఇది నిత్య కృత్యంగా మారింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగర శివార్లలో శ్రీ స్వామి నారాయణ గురుకుల విశ్వ విద్య ప్రతిస్థానం గోశాలలో రోజూ చాలా మంది శరీరాలకు ఆవుపేడను పట్టించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల కోవిడ్ నయం అవుతుందని అంటున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీకి చెందిన గౌతమ్ మనీలాల్ బోరిసా అనే వ్యక్తి ఇలాగే చేశాడట. దీంతో అతను కోవిడ్ నుంచి త్వరగా కోలుకున్నాడట. ఈ మాట అతను అందరికీ చెప్పాడు. దీంతో అందరూ అలాగే చేయడం మొదలు పెట్టారు. ఇలా అక్కడికి రోజూ వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. ఆవు పేడతో కోవిడ్ తగ్గదని, పైగా ఆవు పేడను శరీరానికి రాసుకుంటే బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని, కనుక ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని సూచిస్తున్నారు. అయినప్పటికీ అక్కడి వారు మాత్రం తమ పనిని కొనసాగిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…