చాలా మంది వివిధ రకాల రెసిపీలను చేసుకుంటూ ఉంటారు. అయితే సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఏవైనా చేసుకోవాలనుకుంటే ఈ ఎగ్ ఫ్రెంచ్ ప్రైస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎంత తొందరగా రుచికరంగా తయారుచేసుకుని ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
* కోడిగుడ్లు 5
*ఉప్పు చిటికెడు
*కారం అర టీ స్పూన్
*గరం మసాలా అర టీ స్పూన్
*చిల్లి ఫ్లెక్స్ రెండు టేబుల్ స్పూన్లు
*కొత్తిమీర తురుము ఒక టీస్పూన్
*బ్రెడ్ ముక్కలు 2
*నూనె డీప్ ఫ్రైకి సరిపడా
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. ఈ కోడిగుడ్లలోకి కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర తురుము, చిల్లి ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక వెడల్పాటి బాక్స్ తీసుకుని అందులోకి వేయాలి. తరువాత స్టవ్ పై కుక్కర్ పెట్టి కుక్కర్ లో ఎలాంటి నీరు పోయకుండా కోడిగుడ్డు మిశ్రమం వేసుకున్న గిన్నెను అందులో పెట్టి మూత పెట్టి. కేవలం ఆవిరికి మాత్రమే కోడిగుడ్డు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
ఈ విధంగా ఈ మిశ్రమం ఉడికిన తర్వాత దానిని ఒక ప్లేట్లుపై బోర్ల వేస్తే ఉడికిన కోడిగుడ్డు మిశ్రమం నీటిగా ప్లేటులో పడుతుంది. ఇప్పుడు దీనిని కత్తి తీసుకొని వేలి పొడవు సైజులో కట్ చేసుకోవాలి. ఈలోగా స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనెను వేసి మరిగించుకోవాలి.అదేవిధంగా బ్రెడ్ ముక్కలను మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఎగ్ పీసెస్ ను బ్రెడ్ పౌడర్ లో అటు ఇటు తిప్పుతూ నూనెలో వేస్తూ బ్రౌన్ రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలను వేయించుకున్న తరువాత వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ ను టమోటో కెచప్ తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…