లాక్ డౌన్ : సొంతూళ్లకు క్యూ కట్టిన వలస కూలీలు!

April 20, 2021 10:26 PM

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రతరం కావడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వారం రోజులపాటు లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే వలస కూలీలు సొంతూళ్లకు వెళ్ళడానికి క్యూ కట్టారు. ఇప్పటివరకు వీకెండ్, రాత్రి సమయంలో కర్ఫ్యూ నిబంధనలు ఉన్నప్పటికీ సోమవారం నుంచి లాక్ డౌన్ ప్రకటించడంతో వేలాది మంది వలస కూలీలు తమ సొంత ఊళ్లకు బయలుదేరారు.

ఒక్కసారిగా కూలీలు అందరూ సొంతూళ్లకు పయనం కావడంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు జనాలతో కిక్కిరిసిపోయాయి.ఆనంద్‌ విహార్ బస్ టెర్మినల్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై ఇసుకేస్తే రాలనంతగా జనాలతో నిండిపోయాయి. ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ కరోనా కేంద్రంగా మారిపోయింది. తమ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం టెర్మినల్ గోడలను దూకుతూ పూర్తిగా కరోనా నిబంధనలను గాలికి వదిలేశారు.

కేవలం వారం రోజుల పాటు లాక్ డౌన్ అని ప్రకటించినప్పటికీ తరువాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితిలో గతేడాది మాదిరిగా ఎన్నో బాధలు అనుభవించకుండా, వారి ఉపాధిని కోల్పోకుండా ముందస్తు జాగ్రత్తలతో వలస కూలీలు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. సోమవారం ఒక్కరోజే బీహార్, యూపీ ప్రాంతాలలో దాదాపు20 వేల మంది వలస కూలీలు నాలుగు వందల బస్సులలో ప్రయాణించినట్టు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment