రోజూ గోమూత్రం తాగడం వల్లే కరోనా రాలేదు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

May 19, 2021 6:30 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియా వేదికగా ఈ పద్ధతులు పాటిస్తే కరోనా రాదు, ఇలా చేస్తే కరోనా రాదనే వార్తలు చక్కర్లు కడుతున్నాయి. ఈ క్రమంలోని ఏది నిజమో ఏది అబద్దమో తెలియని అయోమయంలో ప్రజలు ఉన్నారు.

ఈ విధమైనటు వంటి అవాస్తవాలను ప్రచారం చేయడంలో కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా, ప్రజాప్రతినిధులు సైతం ప్రజలను తీవ్ర అపోహలకు గురి చేస్తున్నారు. ఇదివరకే ఎంతో మంది బీజేపీ నేతలు వారు గోమూత్రం తాగడం వల్లే వారికి కరోనా లేదని, ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

తాజాగా ఎప్పుడు వివాదాలలో ఉండే బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కూడా గోమూత్రం పై ప్రచారం చేపట్టారు. తాను ప్రతిరోజు గోపంచితం తాగడం వల్లే తనకు కరోనా రాలేదని వ్యాఖ్యానించారు. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ఈ విధమైనటువంటి అవాస్తవ ప్రచారాలను చేయడంతో ప్రజలు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిపుణులు సైతం ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయని, ఎవరూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే విషయాలను నమ్మొద్దని, కరోనా రాకుండా ఉండాలంటే కేవలం జాగ్రత్తలు పాటించడం ఒక్కటే పరిష్కార మార్గమని నిపుణులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment