కరోనా రోగులకు గోమూత్రం పంపిణీ.. ఎక్కడో తెలుసా?

May 9, 2021 9:57 PM

దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో కొందరు కరోనా సోకిన వారికి ఆయుర్వేదం మందులను వాడుతున్నారు. తాజాగా ఒక కోవిడ్ కేర్ సెంటర్ లో ఉన్న కరోనా రోగులకు గోమూత్రంతో తయారుచేసిన మందులను పంపిణీ చేస్తూ వారికి చికిత్స చేస్తున్న ఘటన గుజరాత్‌లో బనస్కాంత జిల్లాలో చోటుచేసుకుంది.ఇక్కడ కరోనా వైరస్ తేలికపాటి లక్షణాలు గల వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ కోవిడ్ సెంటర్‌కు వేదలక్షణ పంచగవ్య ఆయుర్వేద కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ అని పేరు పెట్టారు.

ప్రస్తుతం ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో 7 బాధితుల కరోనాకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ బాధితుల కోసం ఆవు పాలు, నెయ్యి,గోమూత్రంతో తయారు చేసినటువంటి ఆయుర్వేద మందును పంపిణీ చేస్తూ కరోనాకు చికిత్స చేస్తున్నట్లు గోశాల ట్ర‌స్టీ మోహన్ జాదవ్ తెలిపారు. మే 5వ తేదీన ఈ కేర్ సెంటర్ ప్రారంభించగా ఇప్పటివరకు ఏడుగురు కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సెంటర్లో కరోనా చికిత్స కోసం బాధితుల నుంచి ఎటువంటి డబ్బులు లేకుండా ఉచితంగా 24 గంటలపాటు సేవలు చేస్తున్నామని మోహన్ జాదవ్ తెలిపారు.ఇద్దరు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కరోనా రోగులు 24 గంటల పాటు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment