భార‌త‌దేశం

ఏకంగా కోవిడ్ రోగితో అసెంబ్లీ ముట్టడి.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రిలో ఆక్సిజన్, పడకల సౌకర్యం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.తాజాగా కర్నాటకలో జరిగిన ఓ సంఘటన మన దేశంలోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో,కరోనా కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితికి అద్దం పడుతుంది.

బెంగళూరు నగరంలోని కరోనాతో బాధపడుతున్న ఓ మహిళను ఆసుపత్రిలో చేర్చడం కోసం తీసుకెళ్లారు. అయితే ఆ నగరం మొత్తం తిరిగిన ఆమెకు ఒక ఆస్పత్రిలో కూడా బెడ్ దొరకకపోవడంతో ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కుటుంబం కరోనా రోగిని తీసుకొని ఏకంగా కర్ణాటక అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. వీరికి మద్దతుగా బంధువులు,యువజన కాంగ్రెస్ నేత నాల్పాద్ అక్కడికి చేరుకొని నిరసనలో పాల్గొన్నారు.

దాదాపు అరగంట పాటు అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే సి ఎస్ రవికుమార్‌ వెంటనే బాధితుడికి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో బెడ్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బాధితులతో కలిసి విధానసౌధ ఎదుట ఆందోళనకు దిగిన యువజన కాంగ్రెస్ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఒకటి చాలు మన దేశంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM