బాబా కా దాబా తాత అందరికీ గుర్తుండే ఉంటాడు. రోడ్డు పక్కన ఉన్న స్టాల్ లో ఆహారం విక్రయిస్తూ ఒక్క వీడియో ద్వారా రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయిన ఈ తాత గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది.కరోనా వ్యాపించి చితికిపోయిన ఆ పెద్దాయన తన కష్టాలను ఆ వీడియోలో షేర్ చేసుకున్నారు.ఈ వీడియో చుడాగానే ఢిల్లీ వాసులు పెద్ద ఎత్తున ఈ తాత టిఫిన్ స్టాల్ ముందు
క్యూ కట్టారు.కేవలం ప్రజలు మాత్రమే కాకుండా స్విగ్గి, జోమాటో వంటి వంటి ఫుడ్ యాప్‌లు సైతం సహకరించడంతో ఈ తాత ఏకంగా ఓ రెస్టారెంట్ ను ప్రారంభించాడు.
మాల్వీయ నగర్‌లో నివసిస్తున్న కాంతా ప్రసాద్, ఆయన భార్య బదామీ దేవిలు ఫిబ్రవరి నెలలోనే తమ రెస్టారెంట్ మూసివేశారు. ఈ సందర్భంగా తాత కాంత ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ లాక్ డౌన్ కి ముందు ప్రతిరోజు రెస్టారెంట్ ఖర్చులు పోను సుమారుగా 3500 రూపాయలు లాభం వచ్చేది. కానీ ప్రస్తుతం అలాభం వెయ్యి రూపాయలకు పడిపోయింది. ఈ విధంగా రెస్టారెంట్ లో వచ్చే డబ్బులు మా కుటుంబ సభ్యులకు ఏ మాత్రం సరిపోవడం లేదు అందుకోసమే రెస్టారెంట్ మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు.
గత ఏడాది డిసెంబర్లో ఈ రెస్టారెంట్ ప్రారంభించిన కాంత ప్రసాద్ రెస్టారెంట్ ఖర్చులు అక్కడ పనిచేసే సిబ్బందికి కరెంటు బిల్లు, హోటల్ అదే మొత్తం కలిపి నెలకు లక్ష రూపాయల వరకు ఖర్చు అయ్యేది. కానీ రెస్టారెంట్ కి కనీసం 40000 కూడా ఆదాయం లేక పోవడం వల్లే హోటల్ ప్రారంభించిన మూడు నెలలకే మూసివేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా కాంతా ప్రసాద్ తెలిపారు.
ఈ విధంగా తమ హోటల్ మూడు నెలలకే మూసివేయడానికి కారణం సామాజిక కార్యకర్త తుశాంత్ అద్లాఖా అని ప్రసాద్ ఆరోపించారు. కొత్త రెస్టారెంట్ ప్రారంభించేందుకు ఆయనే సాయంచేశారు కానీ రెస్టారెంట్ బాధ్యతలను మర్చి పోవడం వల్లే రెస్టారెంట్ మూసివేయాల్సి వచ్చిందని తెలుపగా..అద్లాఖామాత్రం రెస్టారెంట్ నడుపకపోవడానికి కారణం కాంత ప్రసాద్ ఇద్దరు కొడుకులని తెలిపారు. వారిప్పుడు రెస్టారెంట్ బాధ్యతలను తీసుకోకుండా హోమ్ డెలివరీ ఆర్డర్లు పట్టించుకోకుండా ఉండటం వల్లే ఈ విధంగా హోటల్ మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు. ఏదిఏమైనప్పటికీ కాంత ప్రసాద్ తిరిగి రోడ్డున స్టాల్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…