మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు.. అభిమానుల్లో ఎంతో ఉత్సాహం నెలకొంటుంది. ఆయన సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ? అని వారు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఆయన హాలీవుడ్ చిత్రంలో నటిస్తే ఎలా ఉంటుంది ? అభిమానుల్లో ఇంకా అంచనాలు భారీగా పెరిగిపోతాయి కదా. అవును. అయితే ఆయనకు ఆ అవకాశం వచ్చింది కానీ.. ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇంతకీ ఏంటా సినిమా ? అంటే..
1998లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అబు బాగ్దాద్ గజదొంగ అనే మూవీని ప్రారంభించారు. అప్పట్లో రూ.5 కోట్లు పెట్టడమే ఎక్కువ. అలాంటిది రూ.50 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని ప్రారంభించారు. గ్రాండ్‌గా ఓపెనింగ్ కూడా అయింది. దీన్ని ఒకేసారి తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కించారు. ఇంగ్లిష్ వెర్షన్‌కు డుషాన్ జర్సి దర్శకత్వం వహించగా, తెలుగు, హిందీ వెర్షన్లకు సురేష్ కృష్ణను దర్శకుడిగా తీసుకున్నారు. ఏఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కొందరు కోర్టులకెక్కారు. ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్ పేపర్లను టీ కప్పులో ముంచే సీన్ ఒకటి ఉంది. దీంతో ఈ మూవీ షూటింగ్‌ను నిలిపివేయాలని సౌదీతోపాటు పలు ఇతర దేశాల్లోని వారు కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో ఈ మూవీ షూటింగ్‌ను ఆపేయాలని కోర్టులు తీర్పులు చెప్పాయి. అలాగే ఈ మూవీకి చెందిన ఓ పోస్టర్‌లో సూర్య భగవానుడికి 9 రథాలు ఉన్నట్లు చూపించారు. కానీ హిందూ మతం ప్రకారం సూర్యుడికి 7 రథాలే ఉంటాయి. ఇది కూడా వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో కొందరు దీనిపై కోర్టుకెక్కగా కోర్టు మూవీ షూటింగ్‌ను ఆపేయమని చెప్పింది. అలా తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ మూవీ ఆగిపోయింది.
అయితే ఇదే మూవీ గనక అప్పట్లో వచ్చి ఉంటే బాహుబలి సాధించిన రికార్డులు అప్పట్లోనే ఈ మూవీ సాధించి ఉండేదని విశ్లేషకులు ఇప్పటికీ చెబుతుంటారు. ఏది ఏమైనా హాలీవుడ్‌లో అడుగు పెట్టాలని తొలిసారిగా చిరంజీవి చేసిన ప్రయత్నం అలా దెబ్బ తిన్నది. దీంతో ఆయన ఎంతో నిరుత్సాహానికి గురయ్యారట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…