India Vs West Indies : అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ సునాయాసంగా విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ తడబడింది. లక్ష్యం తక్కువే అయినప్పటికీ వెస్టిండీస్ సాధించలేక చేతులెత్తేసింది. దీంతో విండీస్‌పై భారత్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా ఫీల్డింగ్‌ను ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో సూర్య కుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ రాణించారు. 83 బంతులు ఆడిన యాదవ్ 5 ఫోర్లతో 64 పరుగులు చేయగా.. 48 బంతుల్లో రాహుల్ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోసెఫ్, ఓడియన్ స్మిత్‌లు చెరో 2 వికెట్లు తీశారు. కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకియల్ హోసెయిన్, ఫేబియన్ అలన్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 46 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. కేవలం 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో షమర్ బ్రూక్స్ (44 పరుగులు) మినహా ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 4 వికెట్లు పడగొట్టగా శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. అలాగే సిరాజ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడాలకు తలా 1 వికెట్ దక్కింది. ఈ సిరీస్‌లో చివరిదైన వన్డే మ్యాచ్ ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…