India vs Newzealand : ఇటీవలే ముగిసిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్ చెత్త ప్రదర్శన చేసిన విషయం విదితమే. అయితే ఆ టోర్నీ ఇచ్చిన షాక్ నుంచి భారత్ బయట పడేందుకు ఆలోచిస్తోంది. అలాగే అటు న్యూజిలాండ్ కూడ తమకు ఫైనల్‌లో కలిగిన అసంతృప్తి నుంచి బయట పడేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ భారత్‌లో పర్యటిస్తోంది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తరువాత రెండు జట్లు 2 టెస్ట్ మ్యాచ్ లను ఆడనున్నాయి. ఇక భారత క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. టీ20లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ పగ్గాలు అందుకున్నాడు. దీంతో నేటి నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌పై ఆసక్తి నెలకొంది.
బుధవారం రాత్రి 7 గంటలకు భారత్, కివీస్ జట్ల మధ్య జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఇచ్చిన షాక్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఇక అప్పటి జట్టు నుంచి కొందరిని పక్కకు తప్పించి కొందరిని జట్టులోకి తీసుకున్నారు.
హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలను తప్పించి ఐపీఎల్ స్టార్ పెర్ఫార్మర్ వెంకటేష్ అయ్యర్‌కు ఈ సిరీస్‌లో అవకాశం కల్పించారు. ఇది అతనికి తొలి టీ20 మ్యాచ్. కాగా టీ20 వరల్డ్ కప్‌లో చాన్స్ లభించని శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, యజువేంద్ర చాహల్‌లకు ఈ సిరీస్‌లో అవకాశం లభించింది. పేసర్లు జస్‌ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు రెస్ట్ ఇచ్చారు. వారి స్థానంలో మహమ్మద్ సిరాజ్, అవేష్ బౌలింగ్ అటాక్‌ను ప్రారంభిస్తారు. ఇక భువనేశ్వర్ కుమార్ కూడా ఈ సిరీస్‌లో పాల్గొంటున్నాడు. అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్‌లకు జట్టులో అవకాశం లభించింది.
మరోవైపు కివీస్ టీమ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు రెస్ట్ ఇచ్చారు. త్వరలో జరగనున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం విలియమ్సన్ ఈ టీ20 సిరీస్‌లో ఆడడం లేదు. అతనికి బదులుగా టిమ్ సౌతీ టీ20 సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తిస్తాడు. రెండు జట్ల మధ్య కాన్‌పూర్‌లో నవంబర్ 25న తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇక న్యూజిలాండ్ టీమ్‌లో కైలీ జేమిసన్, ట్రెంట్ బౌల్ట్, డెరిల్ మిచెల్‌లు కీలకంగా మారారు. అయితే ఆ జట్టులోని రిస్ట్ స్పిన్నర్ ఇష్ సోధిని ఎదుర్కోవడంలో రోహిత్ విఫలం అవుతూనే ఉన్నాడు. మరి ఈ సారి రోహిత్ ఎలా ఆడుతాడో చూడాలి.
ఇక ఈ రెండు జట్లకు చెందిన ప్రాబబుల్ ఎలెవెన్స్ ఇలా ఉన్నాయి.
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, దీపక్ చాహర్ లేదా మహమ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ : టిమ్ సౌతీ (కెప్టెన్), మార్టిన్ గప్తిల్, డెరిల్ మిచెల్, టిమ్ సెయిఫెర్ట్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాన్టనర్, ఆడమ్ మిల్నె, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గుసన్
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…