IND Vs WI : పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ క్రమంలో 3 వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్ నిర్దేశించిన 312 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్లు కోల్పోయినప్పటికీ ఛేదించింది. దీంతో విండీస్‌పై భారత్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 311 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో షై హోప్ 135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేయగా, నికోలాస్ పూరన్ 77 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే దీపక్ హుడా, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 49.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 8 వికెట్లను కోల్పోయి 312 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో అక్షర్ పటేల్ (64 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (63), సంజు శాంసన్ (54), శుబమన్ గిల్ (43)లు ఆకట్టుకున్నారు. విండీస్ బౌలర్లలో అల్జరి జోసెఫ్, కైలీ మయర్స్‌లు చెరో 2 వికెట్లు తీశారు. జేడెన్ సీల్స్, రొమారియో షెఫర్డ్, అకియల్ హోసెయిన్‌లకు తలా 1 వికెట్ దక్కింది. ఈ క్రమంలోనే సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 27వ తేదీన ఇదే వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…