Acharya : ఆచార్య విషయంలో చిరు, కొరటాల జాగ్రత్త పడాల్సిందే.. లేదంటే ?

September 30, 2021 9:11 PM

Acharya : టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఇందులో మెగాస్టార్, రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాట ప్రేక్షకులకు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.

Acharya : ఆచార్య విషయంలో చిరు, కొరటాల జాగ్రత్త పడాల్సిందే.. లేదంటే ?
Acharya

అయితే గత కొద్దిరోజుల నుంచి ఆచార్య సినిమాకు సంబంధించి ఏ విధమైనటువంటి అప్‌డేట్‌ రాకపోవడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై పూర్తిగా ఆసక్తి తగ్గిపోయింది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించకుండానే కొరటాల తన తర్వాత సినిమాలతో బిజీగా ఉండటం చేత ప్రేక్షకులకు ఈ సినిమాపై పూర్తిగా ఆసక్తి తగ్గిపోతోంది.

అయితే ఆచార్య సినిమా నుంచి రిలీజైన లాహే లాహే సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ పాట తర్వాత ఏ విధమైనటువంటి అప్‌డేట్స్‌ రాకపోవడం గమనార్హం. ఇలా ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్‌డేట్స్‌ లేకపోవడంతో ఈ సినిమా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ క్రమంలోనే కొరటాల శివ, చిరంజీవి జాగ్రత్త పడాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తేనే ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now