గురువారం, జూన్ 11, 2026
జ్యోతిష్యం & వాస్తు

Animals In Dreams : ఈ జంతువులు మీకు క‌ల‌లో క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు త్వ‌ర‌లో అదృష్టం ప‌ట్ట‌బోతుంద‌ని అర్థం..!

Animals In Dreams : ప్రతి ఒక్కరు నిద్రపోతున్న సమయంలో కలలు కనడం సహజం. ఇందులో కొన్ని కలలు మన భవిష్యత్తుకు సంబంధించినవి ఉంటాయి. మనకు కలలో కనిపించే దృశ్యాలు భవిష్యత్తు గురించి లేదా మంచి చెడు సూచనలు…

Animals In Dreams : ఈ జంతువులు మీకు క‌ల‌లో క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు త్వ‌ర‌లో అదృష్టం ప‌ట్ట‌బోతుంద‌ని అర్థం..!

Animals In Dreams : ప్రతి ఒక్కరు నిద్రపోతున్న సమయంలో కలలు కనడం సహజం. ఇందులో కొన్ని కలలు మన భవిష్యత్తుకు సంబంధించినవి ఉంటాయి. మనకు కలలో కనిపించే దృశ్యాలు భవిష్యత్తు గురించి లేదా మంచి చెడు సూచనలు ఇస్తాయని చెబుతూ ఉంటారు స్వప్న శాస్త్ర నిపుణులు. ఒక్కోసారి మన కలలో సంబంధం లేని వస్తువులు కనబడుతూ ఉంటాయి. అయితే కొన్ని కలలు మన జీవితంలో జరగబోయే అశుభ ఫలితాలను తెలియజేస్తే, కొన్ని శుభ ఫలితాలను తెలియజేస్తాయి. ముఖ్యంగా మన కలలో ఏయే జంతువులు కనిపిస్తే శ్రేయస్క‌రమో ఇప్పుడు చూద్దాం.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవు కనిపించడం చాలా అదృష్టం. వీరు త్వరలో విజయాలు అందుకుంటారని సూచన. స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో ఏనుగు కనిపించినట్టయితే అదృష్టమే. మీరు త్వరలో ఆకస్మిక లాభాలను అందుకుంటారు. మీ కష్టాలు ముగియబోతున్నాయని సూచన. మీ కలలో గుడ్లగూబ కనిపిస్తే త్వరలో సంపద దేవత అయిన లక్ష్మీ ఆశీర్వాదం పొందుతారని అంటుంటారు. ఈ మీరు అనుకున్న పనులు త్వరలో నెరవేరుతాయి అని సూచన.

if you see these Animals In Dreams then you will get wealth
Animals In Dreams

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నలుపు రంగు పాము కనిపించడం చాలా అదృష్టం. త్వరలో మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి అని సూచన. ముఖ్యంగా కలలో బల్లి కనిపిస్తే శుభప్రదం. త్వరలో మీకు డబ్బు అందుతుందని సంకేతం. మీ కలలో కుందేలు కనిపించినట్టయితే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతుందని సంకేతం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.