Whatsapp : వాట్సాప్‌లో మీకు ఈ లింక్ వ‌చ్చిందా ? క్లిక్ చేశారో గోవిందా.. డ‌బ్బులు పోతాయి..!

October 12, 2021 12:09 PM

Whatsapp : ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ప్ర‌జ‌లు ఏ విధంగా ఉప‌యోగిస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. అనేక సామాజిక మాధ్య‌మాల్లో వారు యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో కొంద‌రు ప్ర‌బుద్ధులు సామాజిక మాధ్య‌మాల‌ను వేదిక‌గా చేసుకుని సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా ఇలాగే వాట్సాప్ లోనూ ఓ మెసేజ్‌ విప‌రీతంగా షేర్ అవుతోంది.

if you got this message in Whatsapp then do not open the link

స‌ద‌రు వాట్సాప్ మెసేజ్‌లో ఓ సందేశం క‌నిపిస్తోంది. అమూల్ డెయిరీ 75వ వార్షికోత్స‌వం సంద‌ర్బంగా ఓ కాంపిటీష‌న్ నిర్వ‌హిస్తోందని, ఓ స‌ర్వేలో పాల్గొని వివ‌రాల‌ను నింపి పంపితే రూ.6000 గెలుచుకోవ‌చ్చంటూ అందులో ఉంది. అలాగే వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సిందిగా ఓ లింక్ కూడా అందులో ఉంది. అయితే నిజానికి పేరు అమూల్ అని ఉంది కానీ.. ఆ వెబ్‌సైట్ మాత్రం వేరేది. అమూల్ ది కాదు. అందువ‌ల్ల ఈ మెసేజ్ న‌కిలీ మెసేజ్ అని నిర్దార‌ణ అయింది.

if you got this message in Whatsapp then do not open the link

క‌నుక ఎవ‌రైనా స‌రే వాట్సాప్ లో త‌మ‌కు ఈ మెసేజ్ వ‌స్తే దానికి స్పందించ‌కూడ‌ద‌ని, అందులో ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తే అంతే సంగ‌తుల‌ని.. డ‌బ్బులు కోల్పోయేందుకు అవ‌కాశాలు ఉంటాయని, ఫోన్ వినియోగ‌దారుల‌కు చెందిన డేటా అంతా చోరీకి గుర‌వుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక మీకు ఈ లింక్ వ‌స్తే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఓపెన్ చేయ‌కండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment