Hyper Aadi : గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్, పోసాని మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా వేడుకల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు నటుడు పోసాని కృష్ణమురళి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పై బూతు పురాణం మొదలుపెట్టగా ఆగ్రహించిన పవన్ అభిమానులు పోసానిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోసాని గురించి పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై ఏవో విమర్శలు చేయగా ఆది జబర్దస్త్ స్కిట్ లో కత్తి మహేష్ పై కౌంటర్ వేస్తూ స్కిట్ చేశాడు.
ఇక ప్రస్తుతం పోసాని, పవన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో హైపర్ ఆది కల్పించుకున్నాడు.. అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆది.. పవన్ కళ్యాణ్ అభిమాని కనుక ఈ విషయంపై స్పందించాడని చాలా మంది భావించారు. కానీ ఇక్కడ నిజం ఏమిటంటే హైపర్ ఆదికి ఇప్పటివరకు కేవలం ఫేస్‌బుక్ అకౌంట్ మాత్రమే ఉంది కానీ ట్విట్టర్ అకౌంట్ లేదని, ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఈ విధమైన ట్వీట్స్ చేస్తున్నారంటూ ఆది తెలియజేశాడు. ఒకవేళ తాను ఏదైనా చెప్పాలనుకుంటే లైవ్ లోకి వచ్చి తెలియజేస్తానని ఈ సందర్భంగా హైపర్ ఆది తెలిపాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…