Snake Island : సాధారణంగా దీవి అంటే అద్భుతమైన ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది. సుందరమైన బీచ్‌లు, ఆహ్లాదకరమైన వాతావరణం బీచ్‌లో ఉంటుంది. కానీ ఆ దీవి పేరు చెబితే చాలు.. ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఆ దీవి నిండా పాములే. అడుగు తీసి అడుగు పెట్టలేం. ఇంతకీ ఏంటా దీవి ? ఎక్కడ ఉంది ? అంటే..
బ్రెజిల్‌లోని సావో పౌలో సిటీకి 90 మైళ్ల దూరంలో Ilha de Queimada Grande అనే దీవి ఉంది. దీన్నే స్నేక్ ఐల్యాండ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ దీవిలో అన్నీ పాములే ఉంటాయి. ప్రతి మూడు అడుగుల దూరానికి ఒక పాము కనిపిస్తుంది. సాధారణంగా మనకు బయట కనిపించే పాముల కన్నా ఈ దీవిలో ఉండే పాములకు మూడు నుంచి ఐదు రెట్ల విషం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ దీవిలో గోల్డెన్ లాన్స్‌హెడ్ అనే ఓ రకానికి చెందిన పాము ఉంటుంది. దీని విషం ఎంతటి ప్రమాదకరం అంటే.. అది ఏకంగా మన చర్మాన్ని కరిగిస్తుంది. అంతటి పవర్ ఉంటుంది.
మరి ఇన్ని పాములు ఉన్న ఆ దీవిలో మనుషులు ఎవరూ ఉండరా ? అంటే.. ఉండేవారు. అది 1920లలో. అప్పట్లో ఈ దీవి సమీపంలో ఉన్న భూభాగానికి ఆనుకుని ఉండేది. కానీ సముద్ర మట్టం పెరిగి ఈ దీవి ఆ భూభాగం నుంచి విడిపోయింది. దీంతో ఈ దీవిలో మనుషులు నివాసం ఉండేవారు కాదు. ఆ తరువాత అక్కడ పాముల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ అప్పట్లో ఈ దీవిలో ఉన్న లైట్ హౌజ్‌కు దగ్గర్లో ఓ ఇంట్లో ఓ కుటుంబం నివాసం ఉండేది. వారు పాములు కుట్టడం వల్ల రాత్రికి రాత్రే అందరూ చనిపోయారు. దీంతో అప్పటి నుంచి ఈ దీవికి ఎవరూ వెళ్లడం లేదు.
అయితే లైట్ హౌజ్ మెయింటెనెన్స్ కోసం అప్పుడప్పుడు నేవీ వారు అత్యంత జాగ్రత్తగా ఈ దీవికి వస్తుంటారు. అలాగే సైంటిస్టులు కూడా ఈ దీవిలోని పాములపై పరిశోధనలు చేసేందుకు కూడా ఈ దీవికి ప్రత్యేక అనుమతితో వస్తుంటారు. అందువల్ల ఈ దీవికి ఎవర్నీ వెళ్లనివ్వడం లేదు.
ఇక ఈ దీవిలో ప్రపంచంలోని పలు అరుదైన రకాలకు చెందిన అత్యంత విషపూరితమైన పాములు కూడా కొన్ని ఉన్నాయి. ఆ విషం చాలా ప్రమాదకరమైంది. దాంతో మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దీవి విస్తీర్ణం 43 హెక్టార్లు మాత్రమే కాగా.. ఇందులో సుమారుగా 4000 వరకు పాములు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
కాగా పైన తెలిపిన గోల్డెన్ లాన్స్‌హెడ్ అనే పాముకు చెందిన విషాన్ని కొన్ని లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ విషంతో గుండె జబ్బులు నయం చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఈ పాముల సంఖ్య రాను రాను తగ్గిపోతోంది. కానీ ఈ దీవిలో ఉన్న ఇతర పాముల సంఖ్య మాత్రం బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ దీవిని తలచుకుంటే ఒళ్లు జలదరిస్తుంది కదా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…