Hyper Aadi : పవన్ కళ్యాణ్.. పోసాని.. మధ్యలో ఆది.. అసలు విషయం బయటపెట్టిన హైపర్ ఆది..!

October 1, 2021 5:41 PM

Hyper Aadi : గత రెండు రోజుల నుంచి పవన్ కళ్యాణ్, పోసాని మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా వేడుకల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు నటుడు పోసాని కృష్ణమురళి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పై బూతు పురాణం మొదలుపెట్టగా ఆగ్రహించిన పవన్ అభిమానులు పోసానిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hyper Aadi : పవన్ కళ్యాణ్.. పోసాని.. మధ్యలో ఆది.. అసలు విషయం బయటపెట్టిన హైపర్ ఆది..!

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోసాని గురించి పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై ఏవో విమర్శలు చేయగా ఆది జబర్దస్త్ స్కిట్ లో కత్తి మహేష్ పై కౌంటర్ వేస్తూ స్కిట్ చేశాడు.

ఇక ప్రస్తుతం పోసాని, పవన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో హైపర్ ఆది కల్పించుకున్నాడు.. అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఆది.. పవన్ కళ్యాణ్ అభిమాని కనుక ఈ విషయంపై స్పందించాడని చాలా మంది భావించారు. కానీ ఇక్కడ నిజం ఏమిటంటే హైపర్ ఆదికి ఇప్పటివరకు కేవలం ఫేస్‌బుక్‌ అకౌంట్ మాత్రమే ఉంది కానీ ట్విట్టర్ అకౌంట్ లేదని, ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఈ విధమైన ట్వీట్స్ చేస్తున్నారంటూ ఆది తెలియజేశాడు. ఒకవేళ తాను ఏదైనా చెప్పాలనుకుంటే లైవ్ లోకి వచ్చి తెలియజేస్తానని ఈ సందర్భంగా హైపర్ ఆది తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now