Holi Festival 2022 : హోలీ పండుగను అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?

March 15, 2022 10:00 AM

Holi Festival 2022 : భారతీయులు ఎన్నో పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా ఘనంగా జరుపుకునే వాటిల్లో హోలీ పండుగ ఒకటి. ఈ హోలీ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ హోలీ పండుగ రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు రంగు రంగుల నీళ్లతో ఎంతో ఘనంగా వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఇలా హోలీ పండుగను జరుపుకోవడానికి గల కారణం ఏమిటి ? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Holi Festival 2022 do you know why Holi is celebrated
Holi Festival 2022

పురాణాల ప్రకారం హోలీ పండుగ అనేది సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు తెలుపబడింది. పురాణాల ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అయితే విష్ణువును పూజించడం ఏమాత్రం సహించని హిరణ్యకశిపుడు తన కుమారుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఈ ప్రయత్నంలో భాగమే తన చెల్లెలు హోలికను పిలిచి తనకున్న వరం కారణంగా ప్రహ్లాదుడిని మంటలకు ఆహుతి చేయమని చెబుతాడు. దీంతో హోలిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అగ్నికి ఆహుతి అవుతుంది.

విష్ణుమూర్తి మాయవల్ల ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడగా హోలిక మాత్రం అగ్నికి ఆహుతిగా మారిపోతుంది. ఈ విధంగా హోలిక అగ్నికి ఆహుతి కావడం వల్ల ఈ పండుగను హోలీ పండుగగా, హోలికా దహనంగా జరుపుకుంటారు. అప్పటినుంచి ఈ రోజున దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. పూర్వం ఈ పండుగను రంగు రంగుల పుష్పాలను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ జరుపుకునే వారు. ప్రస్తుతం ఈ పండుగను వివిధ రకాల రంగులు రంగుల నీటితో జరుపుకుంటున్నారు. అయితే వసంత రుతువు వచ్చిందనే సంతోషంతోనూ ఈ పండుగను జరుపుకుంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment