Divya Nagesh : అరుంధతి చిత్రం అనుష్క కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ఒకటని చెప్పవచ్చు. అనుష్కను లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మార్చింది అరుంధతి. ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో అద్భుత నటన కనబరిచిన అనుష్క నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్పటి వరకు ఫుల్ గ్లామర్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన అనుష్కకు ఈ సినిమాతో ఒక్కసారిగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు క్యూ కట్టాయి. కేవలం అనుష్క మాత్రమే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందాయి.
అరుంధతి చిత్రంలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటికి కూడా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. అరుంధతి చిన్ననాటి పాత్రలో నటించిన అమ్మాయి ఎంతో అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. అనుష్క చిన్ననాటి క్యారెక్టర్ నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు దివ్య నగేష్. అయితే ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా మారి సినిమాలు కూడా చేస్తుంది. నిజానికి దివ్య నగేష్ కేరళ నటిగా అప్పటికే 150కి పైగా అడ్వర్టైజ్మెంట్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత ఆమె టాలెంట్ చూసి అరుంధతిలో అనుష్క చిన్నప్పుడు పాత్ర కోసం తీసుకున్నారు. చిన్ననాటి అనుష్క పాత్రల్లోనూ నటించి దివ్య నగేష్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ప్రస్తుతం దివ్య నగేష్ తమిళ ఇండస్ట్రీలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్లతో దివ్య సినిమాలు కూడా చేస్తోంది.
మళయాళ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేసిన దివ్య నగేష్ ప్రస్తుతం మాత్రం ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగులో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడవుతుంది. రీసెంట్ గా దివ్య నగేష్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి తెలుగు ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…