Divya Nagesh : అరుంధ‌తి చిత్రంలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

September 26, 2022 4:31 PM

Divya Nagesh : అరుంధ‌తి చిత్రం అనుష్క కెరీర్‌లో ది బెస్ట్ మూవీస్‌లో ఒక‌టని చెప్ప‌వచ్చు. అనుష్క‌ను లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మార్చింది అరుంధ‌తి. ఈ సినిమాలో జేజ‌మ్మ పాత్ర‌లో అద్భుత న‌ట‌న‌ క‌న‌బ‌రిచిన అనుష్క న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ఫుల్‌ గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌చ్చిన అనుష్క‌కు ఈ సినిమాతో ఒక్క‌సారిగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు క్యూ క‌ట్టాయి. కేవలం అనుష్క మాత్రమే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందాయి.

అరుంధతి చిత్రంలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటికి కూడా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. అరుంధతి చిన్ననాటి పాత్రలో నటించిన అమ్మాయి ఎంతో అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. అనుష్క చిన్ననాటి క్యారెక్టర్ నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు దివ్య నగేష్. అయితే ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా మారి సినిమాలు కూడా చేస్తుంది. నిజానికి దివ్య నగేష్ కేరళ నటిగా అప్పటికే 150కి పైగా అడ్వర్టైజ్మెంట్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

have you seen how Divya Nagesh is now
Divya Nagesh

ఆ తర్వాత ఆమె టాలెంట్ చూసి అరుంధతిలో అనుష్క చిన్నప్పుడు పాత్ర కోసం తీసుకున్నారు. చిన్ననాటి అనుష్క పాత్రల్లోనూ నటించి దివ్య నగేష్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ప్రస్తుతం దివ్య నగేష్ తమిళ ఇండస్ట్రీలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్లతో దివ్య సినిమాలు కూడా చేస్తోంది.

మళ‌యాళ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేసిన దివ్య నగేష్ ప్రస్తుతం మాత్రం ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నట్లు  తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగులో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడవుతుంది. రీసెంట్ గా దివ్య నగేష్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి తెలుగు ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment