---Advertisement---

Divya Nagesh : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరుంధతి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

August 15, 2022 12:39 PM
---Advertisement---

Divya Nagesh : అనుష్క కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో అరుంధతి ఒకటి. దీనికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా.. సోనూ సూద్ విలన్ గా మెప్పించాడు. అరుంధతి సినిమా అనుష్క కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా ద్వారానే లేడీ ఓరియెంటెడ్ నటిగా అనుష్క గుర్తింపు తెచ్చుకుంది. కేవలం అనుష్కకి మాత్రమే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి.

అయితే ఈ చిత్రంలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటి కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అనుష్క చిన్ననాటి క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు దివ్య నగేష్. రాజసం ఉట్టిపడే పాత్రలో తన నటనతో మెప్పించింది దివ్య నగేష్. అయితే ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా మారిపోయి సినిమాల్లో నటిస్తోంది. నిజానికి దివ్య నగేష్ కేరళ నటిగా అప్పటికే 150కి పైగా యాడ్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

Arundhathi movie child artist Divya Nagesh  see how is she now
Divya Nagesh

మలయాళ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేసిన దివ్య నగేష్ ప్రస్తుతం మాత్రం ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగులో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా దివ్య నగేష్ ఫోటోషూట్ ఒకటి వైరల్ అవుతోంది. దీంతో తాను గ్లామర్ పాత్రలు చేయడానికి రెడీ అంటూ దివ్య నగేష్ సిగ్నల్ ఇస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ లోకి హీరోయిన్ గా కనుక అడుగు పెడితే దివ్య నగేష్ హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now