పుష్ప చిత్రంతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన స్టైలిష్ లుక్ తో ఎప్పుడూ అభిమానులను ఫిదా చేస్తుంటారు. చిత్రానికి చిత్రానికి మధ్య లుక్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ ఎప్పటికప్పుడు అభిమానుల చూపులను ఆకర్షిస్తారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్టైలిష్ లుక్ కి ఐకాన్ గా మారి ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.
మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. తన వస్త్రధారణలోనే అంత ప్రత్యేకత చూపించే అల్లు అర్జున్.. తన నివాస గృహంలో కూడా ఒక స్టైలిష్ లుక్ ఉండాలని కోరుకునే వ్యక్తి. తాజాగా అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ ఏకంగా 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.100 కోట్లు ఖర్చు పెట్టి తన ఇష్టానికి అనుగుణంగా ఉండే ఆకారంలో కనబడేలా ఒక ఇంటిని నిర్మించుకున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి సంబంధించిన ఈ విషయమై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అమీర్ & హమీదా అసోసియేట్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ శర్మ అల్లు అర్జున్ ఇంటిని రూపుదిద్దారు. ఫర్నిచర్ దగ్గర నుంచి అన్ని సదుపాయాలతో అత్యంత విలాసవంతమైన నివాసంగా ఇంటిని డెకరేట్ చేశారు.
ఇంటి చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు పార్టీలు చేసుకోడానికి అనుగుణంగా ఉండే విధంగానే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి, స్విమ్మింగ్ పూల్ వంటి అనేక రకాల సదుపాయాలతో కలర్ ఫుల్ గా ఇంటిని అల్లు అర్జున్ రేంజ్ కు సరిపడే విధంగా ఎంతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇంటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…