హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సంపదలకు నెలవైన లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తే ఎంతో శుభం ఫలితం కలుగుతుందని భావిస్తారు భక్తులు. లక్ష్మీదేవి కృప ఉంటేనే ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. అదేవిధంగా కీర్తి, సంపద పెరిగి ఉన్నత స్థానానికి వస్తారని పండితులు వెల్లడిస్తుంటారు. శుక్రవారం నాడు కచ్చితంగా ఈ నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ అనుగ్రహం లేకుండా ఎలాంటి సంపద మనకు చేకూరదు. సంపద కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం నాడు రోజు మొత్తం ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం సమయంలో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. చామంతి పుష్పాలతోనూ, పసుపు కుంకుమతోనూ లక్ష్మీదేవి అష్టోత్తరం పఠిస్తూ అర్చన చేయాలి. ఆవు పాలు, బెల్లంతో పరమాన్నం వండి నైవేద్యంగా సమర్పించాలి. వెండి లేదా రాగితో తయారు చేసిన శ్రీ యంత్రాన్ని పూజ కథలో పెట్టుకొని ఆరాధించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది.
లక్ష్మీదేవి ఆరాధనలో యంత్రాలకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలన్నా లక్ష్మీకటాక్షం ఎంతగానో అవసరం. ఇందుకోసం మహా లక్ష్మీ యంత్రం, వ్యాపార అభివృద్ధి యంత్రం, కుబేర యంత్రం, శ్రీ యంత్రాలను పూజించడం ద్వారా సంపద అన్నది అభివృద్ధి చెందుతుంది.
లక్ష్మీదేవి మాదిరిగానే కుబేరున్ని కూడా సంపదకి అధిపతిగా భావిస్తారు. కుబేరుని విగ్రహాన్ని వ్యాపార స్థలంలో ఉంచుకోవడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఇంటి సింహ ద్వారం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి లక్ష్మీ సహస్రనామాలు చదవడం ద్వారా ఆర్థిక బాధల నుంచి బయటపడి లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధనం సంపాదిస్తారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…