శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌లుగుతుంది.. కోటీశ్వ‌రులు అవుతారు..

August 8, 2022 9:44 PM

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సంపదలకు నెల‌వైన లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తే ఎంతో శుభం ఫలితం కలుగుతుందని భావిస్తారు భక్తులు. లక్ష్మీదేవి కృప ఉంటేనే ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. అదేవిధంగా కీర్తి, సంపద పెరిగి ఉన్నత స్థానానికి వస్తారని పండితులు వెల్లడిస్తుంటారు. శుక్రవారం నాడు క‌చ్చితంగా ఈ నియమాల‌ను పాటించడం ద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది.  లక్ష్మీ కటాక్షం కలగాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీ అనుగ్రహం లేకుండా ఎలాంటి సంపద మనకు చేకూరదు. సంపద కోసం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం నాడు రోజు మొత్తం ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం సమయంలో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. చామంతి పుష్పాలతోనూ, పసుపు కుంకుమతోనూ లక్ష్మీదేవి అష్టోత్తరం పఠిస్తూ అర్చన చేయాలి. ఆవు పాలు, బెల్లంతో పరమాన్నం వండి నైవేద్యంగా సమర్పించాలి. వెండి లేదా రాగితో తయారు చేసిన శ్రీ యంత్రాన్ని పూజ కథలో పెట్టుకొని ఆరాధించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది.

do like this on friday for goddess laxmi devi blessings

లక్ష్మీదేవి ఆరాధనలో యంత్రాల‌కు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలన్నా లక్ష్మీకటాక్షం ఎంతగానో అవసరం. ఇందుకోసం మహా లక్ష్మీ యంత్రం, వ్యాపార అభివృద్ధి యంత్రం, కుబేర యంత్రం, శ్రీ యంత్రాలను పూజించడం ద్వారా సంపద అన్నది అభివృద్ధి చెందుతుంది.

లక్ష్మీదేవి మాదిరిగానే కుబేరున్ని కూడా సంపదకి అధిపతిగా భావిస్తారు. కుబేరుని విగ్రహాన్ని వ్యాపార స్థలంలో ఉంచుకోవడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఇంటి సింహ ద్వారం  దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి లక్ష్మీ సహస్రనామాలు చదవడం ద్వారా ఆర్థిక బాధల నుంచి బయటపడి లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ధ‌నం సంపాదిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now