ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ పేరుతో పెళ్లికి ముందు వధూవరులు కలిసి ఫోటోలు, వీడియోలకు పోజులివ్వడం ఎంతగా ప్రాచుర్యం పొందిందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా చేయడం పాశ్చాత్య దేశాల్లో తప్ప మన దేశంలో అంతగా ఉండేది కాదు. ఇక ఇప్పుడు పెళ్లికి ముందు ఇది ఒక తప్పనిసరి ట్రెండ్ లా మారిపోయింది. అయితే ఇది కొత్త జంటల మధ్య దూరాన్ని తగ్గించి వారిని మరింత దగ్గర చేయడానికి ఉపయోగపడుతుందని మాత్రం చెప్పవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఫోటో షూట్స్ శృతి మించడం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లూ ఉంటున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఒక జంట పెళ్లి మండపంలో ఒకరినొకరు కొట్టుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వరుడు తన చేత్తో వధువు చేతిలో ఉన్న ప్లేట్ ని తీసుకోవడానికి ప్రయత్నించగా.. వధువు కోపంతో చేయి పైకెత్తి ఒక్కసారిగా వరుడిపై దాడి చేసింది. దీంతో షాక్ కి గురైన వరుడు కూడా వధువుని కొట్టడం స్టార్ట్ చేశాడు. వధూవరులిద్దరూ ఒకరి మీద ఒకరు పడి కొట్టుకున్నారు.
ఇదంతా చూస్తున్న బంధువులు వధూవరులను ఆపేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన వీడియో ఇన్ స్టా లో తెగ వైరలవుతోంది. అసలు వీరిద్దరూ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లికి ముందే ఇలా ఉంటే ఇక నిజంగా వీళ్లకి పెళ్లంటూ జరిగితే కాపురం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే వీళ్లు ఇలా కొట్టుకోవడానికి కచ్చితమైన కారణం మాత్రం తెలియడం లేదు. కానీ ఆ వీడియో చూస్తే మాత్రం.. వారు కావాలనే అలా కొట్టుకున్నారని స్పష్టమవుతోంది. ఈ మేరకు నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…