పెళ్లి మండ‌పంలోనే త‌న్నుకున్న వ‌ధూవ‌రులు.. మీద ప‌డి కొట్టుకున్నారు.. వైర‌ల్ వీడియో..

August 19, 2022 2:19 PM

ఈ మ‌ధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ పేరుతో పెళ్లికి ముందు వ‌ధూవ‌రులు క‌లిసి ఫోటోలు, వీడియోల‌కు పోజులివ్వ‌డం ఎంత‌గా ప్రాచుర్యం పొందిందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా చేయ‌డం పాశ్చాత్య దేశాల్లో త‌ప్ప మ‌న దేశంలో అంత‌గా ఉండేది కాదు. ఇక ఇప్పుడు పెళ్లికి ముందు ఇది ఒక త‌ప్ప‌నిస‌రి ట్రెండ్ లా మారిపోయింది. అయితే ఇది కొత్త జంట‌ల మ‌ధ్య దూరాన్ని త‌గ్గించి వారిని మ‌రింత ద‌గ్గ‌ర చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో ఈ ఫోటో షూట్స్ శృతి మించ‌డం వ‌ల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లూ ఉంటున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఒక జంట పెళ్లి మండ‌పంలో ఒక‌రినొక‌రు కొట్టుకుంటున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో వ‌రుడు త‌న చేత్తో వ‌ధువు చేతిలో ఉన్న ప్లేట్ ని తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. వ‌ధువు కోపంతో చేయి పైకెత్తి ఒక్క‌సారిగా వ‌రుడిపై దాడి చేసింది. దీంతో షాక్ కి గురైన వ‌రుడు కూడా వ‌ధువుని కొట్ట‌డం స్టార్ట్ చేశాడు. వ‌ధూవ‌రులిద్ద‌రూ ఒక‌రి మీద ఒక‌రు ప‌డి కొట్టుకున్నారు.

bride and groom fight each other on stage viral video

ఇదంతా చూస్తున్న బంధువులు వ‌ధూవ‌రుల‌ను ఆపేందుకు ప్ర‌య‌త్నించినా లాభం లేకుండా పోయింది. ఈ క్ర‌మంలోనే ఆ స‌మ‌యంలో తీసిన వీడియో ఇన్ స్టా లో తెగ వైర‌ల‌వుతోంది. అస‌లు వీరిద్ద‌రూ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లికి ముందే ఇలా ఉంటే ఇక నిజంగా వీళ్ల‌కి పెళ్లంటూ జ‌రిగితే కాపురం ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే వీళ్లు ఇలా కొట్టుకోవ‌డానికి క‌చ్చిత‌మైన కార‌ణం మాత్రం తెలియ‌డం లేదు. కానీ ఆ వీడియో చూస్తే మాత్రం.. వారు కావాల‌నే అలా కొట్టుకున్నారని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ మేరకు నెటిజ‌న్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment