శనివారం, జూన్ 13, 2026
వార్తలు

Actress : టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన.. ఈ బూరెబుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టండి..!

Actress : చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా, ఎప్పుడైనా మధురమే. మన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాల్లో బాల్యస్మృతులు ఒకటి. మన చిన్ననాటి ఫోటోస్ చూసి తెగ మురిసిపోతుంటాం. అలాగే మనం ఫాలో అయ్యే, ఆరాధించే సెలబ్రెటీస్ ఇప్పుడు ఏం…

Actress : టాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన.. ఈ బూరెబుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టండి..!

Actress : చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా, ఎప్పుడైనా మధురమే. మన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాల్లో బాల్యస్మృతులు ఒకటి. మన చిన్ననాటి ఫోటోస్ చూసి తెగ మురిసిపోతుంటాం. అలాగే మనం ఫాలో అయ్యే, ఆరాధించే సెలబ్రెటీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ? ఒకప్పుడు ఎలా ఉండేవారు.. అని మనకు అనిపిస్తుంటుంది. అలాగే అప్పుడప్పుడూ కొంతమంది సెలబ్రెటీస్ రేర్ పిక్స్, చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నప్పటి ఫోటోస్ చూసి హీరో హీరోయిన్లను గుర్తించేందుకు నెటిజన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తుంటారు.

తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కు సంబంధించిన ఓ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన ఫోటోలో తల్లి ఒడిలో నుంచి ఫోటోగ్రాఫర్ పై కోపంతో కొట్టేందుకు చేయి లేపిన ఈ బూరె బుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టండి. తెలుగులో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గ్లామర్ పాత్రలైనా.. అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తూ.. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. గతేడాది వరుస బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసింది. ఇప్పటికైనా ఈ చిన్నారి ఎవరో గుర్తొచ్చిందా..?

have you identified Actress priyanka jawalkar in this photo
Actress

 

అమాయకపు చూపులతో.. ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి తెలుగు చిత్రపరిశ్రమలో ఫేమస్ హీరోయిన్. ఆమె మరెవరో కాదు.. ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా సినిమాతో వెండితెరకు పరిచయమైంది ప్రియాంక. తొలి సినిమానే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి హిట్ కొట్టేసింది. ఆ తర్వాత తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, గమనం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. గత కొంతకాలంగా ఈ అమ్మడు నుంచి ఎలాంటి మూవీ అప్‌డేట్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి